Friday, December 20, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

సంతోషానికి మార్గము(ఆడియోతో…)

నవ్వుముఖం కావాలనుకుంటే మనం హంసలుగా మారాలి. హంస ముత్యాలనే ఏరుకుంటుంది. పాలను( సారమును ) తీసుకుని నీళ్ళను వదిలేస్తుంది అని అంటారు. ఈ విధంగా, మనిషి చెడును ప్రక్కన పెట్టి మంచిని చూస్తూ ఉరించే వ్యర్థమైన మాటలను వినడం మాని దివ్య జ్ఞానము అనే సారమునే తీసుకుంటూ, అతని వివేకము కాకిలా, కొంగలా కాక ఒక హంసలా పని చేసినప్పుడు అతను ఎప్పుడూ సంతోషంగా ఉండగలడు. బాగా ఆలోచిస్తే ఇతరుల లోపాలను విన్నప్పుడు, ఇతరులు ఇంత మంచిగా చెయ్యని పనుల గురించి ఆలోచించినప్పుడు, కాకిలా మోసగాడిలా, కొంగలా దొంగ భక్తి చూపించి నా అతని ఆనందమంతా ఒక్క క్షణంలో మాయమవుతుందని అర్ధమవుతుంది. కాబట్టి, పరమహంస అయిన భగవంతుని దగ్గర తాను ముత్యాలను ఏరుకునే హంస అని తెలివైనవాడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అతడొక రాజయోగి , రాజహంస – హంసలకే రాజు, అతను సత్యమైన సారము కొరకే అన్వేషించాలి కానీ నీళ్ళను కాదు, హంసలా వ్యవహరించే వ్యక్తికి రసజనకమైన ముఖ వర్చస్సు ఉంటుంది.

ఇటువంటి వ్యక్తులు తమను తాము రాజహంసలుగా గౌరవించుకుంటారని, ఎప్పుడూ సంతోషంలో ఉంటారని అనుభవం చెబుతుంది. కానీ ప్రస్తుత కలియుగం మన కొరకు వింత విషయాలను దాచి ఉంచింది. వీటి కారణంగా మన సంతోషం ఎల్లప్పటికీ నిలిచి ఉండటం లేదు. ఈ కలియుగం ఇచ్చినవి కాకుండా, మనం సంతోషంగా ఉండటానికి శివ పరమాత్మ మనకు ఏమైనా అనుగ్రహించారా అని తెలుసుకోవడము ఎం తైనా అవసరము.

…..బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement