బాధలే ప్రామాణికాలు(ఆడియోతో…)
పుట్టుకతోటే శారీరకంగా, మానసికంగా వికలాంగులైన వారిని ఎంతో మం దిని మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి దురదృష్టవంతులు ఈ బాధలను
అనుభవించడానికి కారణమేమిటి? కారణం లేకుండా కార్యం లేదు. శారీరిక, మానసిక వికలాంగులకు ఇటువంటి దయనీయ పరిస్థితి ఎందుకు అని అడగవచ్చు. అంటే తప్పకుండా వారు వర్తమానంలో కానీ గతంలో కానీ చేసిన చెడు కర్మల ప్రభావమే ఇది అని చె ప్పవచ్చు. వారు కొన్ని ఆరోగ్యపు సూత్రాలను ఖండించి ఉండవచ్చు. కనుక మంచికీ, చెడుకు మధ్య తేడాను ఖండిస్తున్నాము. అంటే ప్రపంచపు అత్యంత అధోగతి, దౌర్భాగ్యపు స్థితికి కారణమయ్యే అన్యాయపు మానసిక స్థితిని ఏర్పరుచుకుని వాస్తవమునందు కళ్ళు మూసుకుని ఉన్నట్లే. బాధ్యత- బాధ్యతారాహిత్యము, తప్పోప్పుల మధ్య భేదము తెలియనివాడు ప్రభుత్వపు నియమాలనూ ఉల్లంఘిస్తుంటాడు. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం స్వ సంక్షేమముతో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా అవసరమని గుర్తించాలి.
….బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి