అసంతృప్తి మానసిక సంతులతను పోగొడ్తుంది (ఆడియోతో…)
అసంతృప్తి మనసులో చిరాకును తీసుకువచ్చి బుద్ధిలో సమతుల్యతను పోగొడ్తుంది. పర్యవసానంగా, మనిషి నిరాశతో క్రుంగిపోయి, నిరుత్సాహం, టెన్షన్, పగ, ఆవేదన, ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు. బాగుపడే మార్గాలను అన్వేషించే విచక్షణను కోల్పోయి ఆచరణ శక్తిలో బలహీనుడవుతాడు. ఇటువంటి పరిస్థితులలో అతడి ఆలోచనలు, పనులు సవ్యంగా ఉండని కారణంగా గొడవలు జరుగుతాయి. గుణాలలో ఎంత బీదగా ఉన్నా కానీ గాలిలో మేడలు కడుతూ ఉంటాడు. కృషితోనే ఏదైనా సాధించవచ్చు. సరైన అవగాహన శక్తి ఉన్న వ్యక్తి మాత్రమే సక్రమమైన మార్గంలో నడవగలడు. అంతేకానీ మీ వివేకాన్ని మోహము అనే మబ్బుల చేత కప్పేసి తద్వారా సంతోషాన్ని పొగొట్టుకోవడం మాత్రం తప్పు.
….బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గుడూరు శ్రీలక్ష్మి