పాప కర్మల నుండి రక్షించుకొనే ఉపాయం
మనం చేసిన ప్రతి కర్మకు ప్రతిఫలం తప్పకుండా వుంటుంది. వెంటనే గానీ ఆలస్యంగా కానీ కర్మఫలం అనుభవించాల్సిందే. ఈ మాటను ఎవరూ కాదనరు. ఎవరు ఏ కర్మ చేశారో ఏయే ఫలాల్ని అనుభవించారో ఏ కర్మకు ఏ ఫలం ఎప్పుడు ఏ విధంగా ఇంకా అనుభవించాల్సి ఉందో ఇది కూడా తెలియదని అందరికీ తెలిసినదే. కర్మ ఫలదాత మానవుడు తానే కాదు. అతనికి కర్మల గుహ్యగతి గురించి తెలియదు. పరమాత్ముడొక్కడే అజన్మ, అవినాశి, సాక్షి, అకర్త, అభోక్త, అందరి జన్మ పత్రి కర్మ పత్రి(జాతకం) తెలిసినవాడు. కావున గీతలో భగవానుని మహా వాక్యము హే వత్సా నేను నీ అనేక జన్మల గురించి తెలిసినవాడను. కానీ నీకు తెలియదు. నా ద్వారా కర్మల గుహ్యరహ స్యాన్ని గ్రహించు అని ఉన్నది. కావున స్వయంగా పాపకర్మల దండన నుండి రక్షించుకొనగల ఉపాయం ఉందా? లేదా అనే విషయం భగవంతుడే చెప్పగలడు.
ఈ సందర్భంలో భగవంతుని మరొక మహావాక్యం హేవత్సా! నీ వెంత పాపివైనా కావచ్చుగాక నా శరణు పొందు( మమేకం శరణం ప్రజ) నేను నిన్ను సమస్త పాప విముక్తునిగా చేస్తాను. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే శరణు తీసుకోగానే మానవుల పాపాలు, వికర్మలు సమాప్తి అగుటలో ఏ మాయ మహిమ వుంది అనేది. శరణు తీసి కోగానే పాపభారం దిగిపోతుందా? శరణు పొందుట శరణాగతి ద్వారా పాపకర్మలు అంతమగుట ఇంత తేలికైతే 900 ఎలుకలను తిని పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందన్న సామెత ప్రకారం మనిషి కూడా పాపాలు చేస్తూ ఒక రోజు పరమాత్మ శరణు పొందేవాడు కదా!
….బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గుడూరు శ్రీలక్ష్మి