కోయిల తియ్యదనం
మనిషి మనసును అతని భాష వ్యక్తపరుస్తుంది. మనిషి ఎలాంటివాడో అతని మాటలు అలాగే ఉంటాయి. మానసిక ప్రశాంతత అతని మాటలలో సానుకూలత తీసుకువస్తుంది. ” మనిషి మాటలు అతడిని సింహాసనంపై కూర్చోపెట్టగలవు లేక ఉరికంబానికైనా ఎక్కించగలవు” అని అంటారు. అందుకే కోయిల వలె మధురభాషిగా కావాలని పరమాత్మ ఆజ్ఞాపిస్తారు. మాయ దాడికి బలై పరుష భాషకు వశం కాకండి.
భగవంతుడు ఎంత మధురమైనవాడో గమనించండి. విశ్వంలోని ఆత్మలందరినీ పరమాత్మ అయాస్కాంతములా ఆకర్షిస్తాడు. నిజమైన భక్తులు అతడిని ఎంత గాఢంగా ప్రేమిస్తారు! అతని మధుర మనోహరమైన మాటలతో తయారైన భగవద్గీతను ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో మధురత ఉంది కనుక.
….బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గుడూరు శ్రీలక్ష్మి
———————————-