ఇతరులకు బాధను కలిగించే మన మాటలు మనకూ బాధను కలిగిస్తాయి
ఈ రోజుల్లో మనుషులు మాటలు ఎలా ఉన్నాయంటే ఒకరి మీద రాళ్లు విసురుకుంటున్నట్లుగా ఉంటుంది. అంటే ఇతరులతో మరీ ముక్కుసూటిగా మాట్లాడుతూ బాధను కలిగిస్తున్నారన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే పరమ పిత పరమాత్మ ఇలా అం టున్నారు.- ” దీని అనుసారంగా, మనలో ఎంటువంటి పరుష స్వభావము ఉండకూడదు. మనలో మధురత, తియ్యదనాన్ని నింపుకోవాలి. శివ పరమాత్మ తన పిల్లలనూ ఇలా సంబోధిస్తారు. – నా మధురమైన పిల్లలు కనుక మనం అవిధేయులమై చెడ్డ పిల్లలుగా ఉండకూడదు. మన భాష అమృతంలా సుమధురంగా ఉండాలి. ఇది విషపూరితం కాకూడదు.
….బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గుడూరు శ్రీలక్ష్మి
—————————————-