Thursday, November 21, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

నీతి
మళ్ళీ మంచి రోజులు రావాలనుకుంటే నీచత్వానికి చిహ్నమైన అత్యాశను, లోభాన్ని మనిషి వదలాలి. తనను తాను భగవంతుని సంతానము అని అనుకున్న వ్యక్తి లోభానికి గురి కాడు. ఎప్పుడైనా మీకు అత్యాశ ఆలోచన వస్తే, ఆ అత్యాశను డబ్బుపై కాక భగవంతుని జ్ఞానమును, గుణాలను యోగానుభూతులను ఇంకా ఇంకా పొందాలని పెట్టుకోండి. ఈ సిద్ధులు మన మృత్యువు తర్వాత కూడా మనతో వస్తాయి, అంతే కాక అనేక జన్మలకు మనల్ని ధనవంతులుగా చేస్తాయి. దివ్యజ్ఞానము, సద్గుణాలు, మానవ సేవ అనే సంపదలు ఎప్పటికీ నశించవు. ఎందుకంటే దీని ద్వారా 21 జన్మలకు సరిపడే సుఖం లభిస్తుంది. మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయి. నిజాయితి, నిష్కపటం, సత్యత యోగ్యతకు లక్షణాలు. అత్యాశ, స్వయాన్ని అతిగా పొగుడుకోవడం, ఇతరులను పట్టించుకోకపోవడం, కుటిలత్వం- ఇవన్నీ మనిషికి బాధను కలిగించడమే కాక సమాజంలో అల్లర్లను, చీలికలను తెస్తాయి.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement