Monday, November 18, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మధుర స్వభావముతో సేవ చెయ్యాలి
మండుటెండలో అలమటిస్తున్నవ్యక్తి చల్లని చెట్టు నీడ క్రింద విశ్రాంతి తీసుకున్నప్పుడే సంతోషిస్తాడు. చల్లని మనసు, సంతోషంతో తేజోమయ ముఖాన్ని కలిగి ఉన్నవారు సుఖసంతోషాలను వెదజల్లుతారు అన్నది విదితం. నేటి మానవుడు అనేక విధాలుగా మాయలో కొట్టుకుపోతూ దు:ఖంతో ఉన్నాడు. అతనికి ఆనందాన్ని
చేకూర్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఒక వ్యక్తి తన ఆస్తినంతటినీ తన కుటుంబసభ్యులకు రాసిచ్చినప్పటికీ అతని ప్రవర్తన సరిగ్గా లేకపోతే తన కుటుంబం వారు కూడా సంతోషంగా ఉండలేరు.
ఒక వైద్యుడు రోగానికి సరైన మందును సూచించినా కానీ రోగితో అతని ప్రవర్తన మొరటుగా ఉంటే ఆ రోగి మందులను వాడుతాడు కానీ పూర్తి లాభాన్ని పొందలేడు. అలాగే ఒక సమాజ సేవకుడు ఎంతో ఉత్సాహభరితంగా ఉన్నాకానీ అతని ప్రవర్తన మధురంగా, సమతూకంలో లేకపోతే అతడిని ప్రజలు ఆమోదించరు. అలాగే ఆధ్యాత్మిక సేవకుడు లేక జ్ఞానికి కూడా ఈ రెండు గుణాలు ఎంతో అవసరము. ఒక పరుషంగా మాట్లాడే వ్యక్తి ఉన్నత జ్ఞానమును వినిపించినా కానీ ఎవ్వరూ వినరు.
అందుకే విశ్వపిత అయిన శివుడు తన ఆజ్ఞను ఇలా వినిపిస్తున్నారు.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement