Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ఇతరుల నుండి సహాయాన్ని తీసుకోవడం
మనకు సమయం, శక్తి ఉన్నా కానీ ఇతరుల సహాయం తీసుకోవడం కూడా అహంకారానికి, సోమరితనానికి గుర్తు. మనకున్న గర్వం కారణంగా ఎదుటివారిని మనం తక్కువగా, చిన్నవారిగా చూస్తాము. కనుక, వారు మనకు ఎందుకు చేయరు అని భావిస్తాము. మనకు సేవ చేయడం వారి ధర్మం అని కూడా భావస్తాం. పని చెయ్యలేక, అతి సోమరితనం వలన, మనకున్న గర్వం కారణంగా ఇది మనం చేసే పని కాదులే అని అనుకుంటాం. ఇటువంటి వ్యక్తులు ఎదుటివారి సేవలను నిరభ్యంతరంగా స్వీకరించి కృతజ్ఞతా భావాన్ని కూడా కలిగి ఉండరు. అతడు కర్మల గుహ్య గతిని మర్చిపోయాడు. ఈ విధమైన కర్మలతో అతడి భారం పెరుగుతూనే ఉంటుంది. తన అనాలోచిత కర్మల ద్వారా ఈ భారం మరింత పెరుగుతూనే ఉంటుంది అని అతడు గుర్తించలేక పోతున్నాడు.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement