జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో 13వది ‘పరివర్తన చేసే కళ ‘
పరివర్తనచేసే కళ :
బాబా ఒకసారి స్వధర్మమేది, స్వలక్షణమేది, అది గ్రహించిన తర్వాత దానిననుసరించి తనను తాను పరివర్తన చేసికొనుటయే మలచుకొనుట అనేవారు. బ్రహ్మాబాబా జీవితములో ఇదే పరివర్తన మనము గమనించాము. ఏ రోజున ‘అహం చతుర్భుజం తత్వం’ అని విష్ణు సాక్షాత్కారం జరిగిందో ఆ రోజు నుండే పరివర్తన ప్రారంభమైంది. తీవ్ర పురుషార్ధమనగా తీవ్ర పరివర్తన. ‘శీఘ్రదానమే మహాపుణ్యం’. బాబా ఈ విషయాన్ని తన జీవితంలో మహా మంత్రంగా చేసికొన్నారు.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి