జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో 16వది ‘అంతర్లీనం చేసికొనే కళ ‘
అంతర్లీనం చేసికొనే కళ :
బాబా జీవితంలో ఎవరయినా పిల్లలు వి శ్వాసంతో తమ మనసులోని మాటని బాబాకు చెబితే చాలు బాబా దానిని సముద్రం లాగా ఇముడ్చుకొనే వారు. ఇతరులకు చెప్పేవారు కాదు, అందువలన అందరూ మనసారా తమ మనసులోని విషయాలను బాబాకు వినిపించేవారు. వినాయకుని పెద్ద పొట్ట ఇముడ్చుకొనే కళకు గుర్తుగా చూపించబడుతుంది.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి