Friday, November 22, 2024

బ్రహ్మాకుమారీస్‌.. మధురంగా మాట్లాడే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో తొమ్మిదవది ‘ మధురంగా మాట్లాడే కళ ‘

మధురంగా మాట్లాడేకళ :
”నోరే మనిషిని సింహాసనంపై కూర్చోచెడుతుంది. అదే మనిషిని పతనం చేస్తుంది” కూడా. మధురమైన వాక్కుతో అనేక విపత్కర పరిస్థితులను కూడా దాటుకొనవచ్చును. ఆత్మాభిమాని స్థితితో మన నోటివెంట స్వతహాగానే తియ్యని మాటలు వస్తాయి. ”మధురవచనాలు ఔషధం, కటువచనాలు బాణాలు లాంటివి. చెవుల ద్వారా విన్న ఆ మాటలు మొత్తం శరీరాన్ని శిథిలం చేస్తాయి” అని ఒక కవి అన్నారు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement