నేను ఏదో కోల్పోతున్నాను అని అనుకోవడమే అన్నింటికన్నా గొప్ప భ్రాంతి. వర్తమాన సమయంలో అందరి మనసులలో ఏదో లోటు, ఏదో పొందాలి అనే ఆలోచన వృద్ధి చెందుతోంది. భౌతిక ప్రపంచ పు యొక్క పరిమితమైన అవగాహన కారణముగా ఇటువంటి భావనలు ఏర్పడతాయి. ఈ ప్రపంచములో కొంత వరకే పరిమితమైన భౌతిక వనరులు ఉన్నాయి. కానీ ఆత్మగా నా శక్తి అపారమైనది. ప్రేమ, గౌరవం, సంతృప్తి, ఆనందం అనేవి భౌతిక ప్రపంచం యొక్క ఉత్పత్తులు కాదు. ఆధ్మాత్మిక శక్తిగా నాకు అవసరమైన వి అన్ని నా అందుబాటులో ఉన్నాయి అనేది గుర్తించాలి. ఎందుకంటే ఇవి ఆధ్మాత్మిక అనుభవాలు. ఈ రోజు నేను ఏదో కోల్పోతున్నాను అనే ‘బలహీనత’ లేదా భ్రాంతి నుంచి దూరంగా స్వయాన్ని సంపూర్ణంగా అనుభవం చేస్తాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి