Sunday, November 24, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మనలోని అన్ని చెడు ఆలోచనలు, ఒత్తిడి కలిగించే ఆలోచనలను అంతం చేయటానికి మనం తప్పనిసరిగా అంతరాత్మ అనే వ్యాయామశాలలో శ్రమించాలి. ఇలాంటి ఆలోచనలతో పోరాటం చేస్తున్న కొద్ది అవి మరింతగా ధృఢంగా అవుతాయి. వాటిని అణిచి వేయాలని ప్రయత్నం చేస్తే మనం ఊహించని విదంగా మరింత వేగంగా, రెట్టింపై విసిరిన బంతి లాగా అవి వెనుకకు తిరగి వస్తాయి. అలాంటి ఆలోచనలను పరిశీలన చేసి, వాటికి జీవనాన్ని ఇస్తున్న శక్తిని నిరాకరించడం అంటే, వాటికి జీవశక్తి అయిన మన ధ్యాసను వాటితో సంబంధము లేనట్లుగా చేసి తొలగిస్తూ అవి కరిగపోయి, కనుమరుగు అవుతాయి. వాటి మరణం మన మరణం కాదు, మన గురించి మనకు రమరింతగా అంటే నిశ్శబ్ధండగా, స్థిరంగా, మనలో ఎప్పుడూ ఉపస్తితం అయి ఉన్న స్వయం గురించి స్వయమునకు అవగాహన పెరుగుతుంది. ఈ రోజు నాలోని చెడు ఆలోచనలు అంతం చేయడానికి సరి అయిన వ్యాయామం చేసి ధృఢంగా అవుతాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement