శక్తి మరియు అవగాహన ఈ రెండు వ్యక్తిగత మార్పుకు అవసరమైనవి. ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రక్రియలో నిమగ్నం అవటం అంటే స్వయాన్ని హద్దులకే పరిమితం చేస్తున్న విధానాలను అవగాహన చేసుకోవడం మరియు వదిలి వేయటం. ఆ విధానాలను అర్థం చేసుకోవడం ఒకటైతే, పరివర్తన చేసుకునే శక్తి కలిగి ఉండడం మరొకటి. నన్ను హద్దులకు పరిమితం చేస్తున్న విధానాలను పరివర్తన చేసుకునే శక్తిని ఎక్కడ నుంచి నేను పొందగలను.? ఆధ్మాత్మిక మూలాలతో సన్నిహిత సంబంధం మరియు ధ్యానం ద్వారా స్వయంపైన ప్రేమను అలాగే పరివర్తన చెందడానికి అవసరమైన శక్తిని పొందగలుగుతాము. ఈ రో జు పరివర్తన చెందడానికి శక్తిని ఉత్పత్తి చేస్తాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి