కోరికలు, ఆశలు ఎవరినైతే ఇబ్బంది పెట్టవో అటువంటి వ్యక్తి మాత్రమే తృప్తిగా ఉండగలడు అనేది సత్యం. కాబట్టి, సంతృప్తిగా ఉన్న వ్యక్తి విషయంలో కోరికలు తీరకపోవడం, అసంతృప్తి వంటివి తలెత్తే ప్రశ్నే లేదు. ఎందుకంటే అతనికి అసలు కోరికలే ఉండవు కాబట్టి. అతని జీవితంలో దు:ఖం అనే పదానికి అర్థమే లేదు. ఎందుకంటే అసంతృప్తి అన్న భావన నుండే దు:ఖం కలుగుతుంది. సంతృప్తి పరుడు ఇటువంటి వాటికి దూరంగా ఉంటాడు కాబట్టి అతనికి ఎప్పుడూ దు:ఖం ఉండదు. అన్నది స్పష్టమయ్యింది. అతని అలవాట్లు మరియు మనోవృత్తి ఎంతో ఊరటతో నిండి ఉంటాయి. కనుక నిలకడగా ఉంటాడు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి