ఒకే సమయంలో, ఒకే స్థలంలో ఇద్దరు అతిథులు ఉన్నారనుకుందాం. వారిద్దరూ విందును ముగించారు. అందులో ఒక అతిథి మరో అతిథితో ”మనం ఇలాంటి భోజనం తింటామని నేనెప్పుడూ అనుకోలేదు. మనల్ని విందుకు పలిచిన వాడు మనల్ని ఫూల్స్ చేసాడు. ఇంతటి సాధారణ భోజనం కోసం మనం మన సమయాన్ని వృథా చేసుకున్నాం. అందరి ముందు నేను ఇప్పుడేమి అతనికి చెప్పను కానీ రేపు చెప్తాను…” అని అంటాడు. మరో అతిథి ఇది విని ” నేస్తమా అది తప్పు. మంచి తిండి కోసం మనం ఇక్కడకు రాలేదు, అతని హోదాను చూపించుకోవడానికి అతను మనల్ని ఈ విందుకు పిలువలేదు. అతను చెయ్యగలిగినదంతా చేసాడు. అంటే ఈ విందు అతనికి మన పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. అతడు ఎంత ప్రేమ, స్నేహంతో మనల్ని పిలిచాడు అని ఆలోచించు కానీ విందులో పెట్టిన వాటి గురించి ఆలోచించకు. నీ టైం వేస్టు అయ్యింది అని అనుకోకు, మన మధ్య స్నేహం, ప్రేమ ఇంకా పెరగడానికి మనందరం మనస్ఫూర్తిగా మాట్లాడకోవడానికి ఈ విందు ఒక మాత్రమే… అంటాడు.
అసంతృప్తిగా ఉన్న వ్యక్తికి, సంతృప్తిగా ఉన్న వ్యక్తికి మధ్య ఎంత తేడా ఉందో మీరే నిర్ణయించండి. మెదటి వ్యక్తి తన తొందరపాటుతో ఇతరులను కోప్పడుతూ, చివాట్లు పెడుతూ వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటాడు. రెండవ వ్యక్తి తమకు ఆతిథ్యమిచ్చిన వ్యక్తిలోని మంచి గుణాలను మొదటి వ్యక్తి దృష్టికి తీసుకువస్తాడు. కాబట్టి ఇతడు ఎటువంటి పరిస్థితిలోనూ సంతోషంగా ఉంటూ తమకు ఆతిథ్యమిచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి