కార్య సాధన కన్నా, తియ్యని సంబంధాల అనుభూతి, సంతృప్తి మనలో ఎక్కువ కాలం ఉంటుంది. కార్య శూరత్వము కన్నా అందరిలో మనం సన్నిహితులమనే భావనను పెంపొందించడమే ముఖ్యమైనది. వ్యాపారములోనైనా, వ్యవహారములోనైనా ప్రశంస, పోత్సాహంతో కూడిన మాటలతో కొంత సమయం ఇతరులతో గడిపితే, మనం వారి స్వంతవారిమనే, సన్నిహితమైన భావనను వారిలో కల్పిస్తాం. ఇది పరస్పరాన్ని ఐక్యత అనే దారంతో బంధిస్తుంది. వారితో మన పనిని సులువుగా చేస్తుంది. ఈరోజు ఇతరులతో సంబంధాలు మెరుగుపర్చు కోవడం ద్వారా సులవుగా పని పూర్తి చేసుకుంటాను.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి