ఇతరులపై అంచనాలను పెంచుకోవడంతో మనం వారిపై అధికారం ఉన్నట్లుగా ప్రవర్తిస్తాము. అందువల్ల అంచనాలను పెంచుకోకండి. ఇతరుల స్వతంత్రత, ముందుకు వెళ్లడం, అభివృద్ధికి అవకాశం ఇవ్వడంలో మన అంచనాలు సామార్థ్యాన్ని పరిమితం చేస్తాయి. ఎవరినైనా అలా బంధిస్తే స్వయాన్ని మరియు పరస్పరాన్ని పరిమితం చేసుకున్నట్లే. ఇతరులను బంధించకుండా మన అవసరాలకు తగిన విధముగా వారు చేసే ప్రతి పని ఉండాలని అనుకోకుండా నిజమైన ప్రేమతో మన ఆసరాను, సహకారమును వారికి అందించాలి . ఈ రోజు అంచనాల బంధము లేకుండా ఇతరులకు ఏది మంచిదో సత్యమైన ప్రేమతో అది అనుభవం చేయిస్తాను.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి