Tuesday, November 26, 2024

సిద్ధి ప్రదాత బ్రహ్మచారిణి

శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత ఆరాధన అనాదిగా ఆచరణలో ఉంది. దేవీ భాగవతం, దుర్గ సప్తశతి, మార్కండేయ పురాణంలో దుర్గాదేవి మహా త్మ్యం వర్ణించబడింది. దేవిని తొమ్మిది అవతారాలు తొమ్మిది దినా లు రూపానికి తగిన అలంకారాలతో, ఆయుధాల తో నవదుర్గలుగా ప్రత్యేకంగా పూజించడం సం ప్రదాయం. మొదటి రోజున ”శైలపుత్రి” దుర్గ… నంది తన వాహనంగా కుడిచేత త్రిశూలా న్ని, ఎడమ చేత పద్మ పుష్పాన్ని ధరించి దర్శన మిచ్చింది. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచా రిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నార దుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. తపో దీక్షాధారిణిగా కన్పిస్తుంది. కుడిచేత రుద్రాక్షమాల ఎడమ చేత కమండలం ధరించి ఉం టుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమే శ్వరుని భర్తగా పొందేవరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకి కన్యాకుమారి అనే మరో పేరు వుంది. ఈ మాతను ఉపాసించేవారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. దక్షిణ కాశీక్షేత్రంగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీనవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వరీదేవి దేవీ నవరాత్రుల రెండవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ విదియ రోజు ‘బ్రహ్మచారిణి’ అవతారంలో దర్శనం ఇస్తారు. రాత్రి ఉత్సవ విగ్రహాలను ఆలయంలో పల్లకీపై ప్రదక్షిణాలు చేయిస్తా రు. శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారు బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయంలో అలంపూర్‌లోని శక్తిపీఠం జోగులాంబ ఆలయంలో అమ్మవారు బ్రహ్మ చారిణిగా దర్శనమిస్తారు.

బాలాత్రిపురసుందరిగా కనకదుర్గమ్మ
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ రెండవరోజు బాలాత్రిపురసుందరీ దేవిగా దర్శనం ఇస్తుం ది. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం ఇచ్చే అలంకారం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపా సకులు బాలార్చన చేస్తారు. ఈరోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి లేత గులాబీరంగు వస్త్రంతో అలంకరిస్తారు. అమ్మవారికి పులిహోరను నైవే ద్యంగా సమర్పిస్తారు. దీనిద్వారా సకల దోషాలు పోతాయని పండితులు చెబుతారు. శ్రీ బాలాత్రిపురసుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని బావిబసవేశ్వర ఆలయంలో దేవీనవరాత్రుల సందర్భంగా శైలపుత్రి అవతారంలో అన్నపూర్ణేశ్వరిదేవీ దర్శనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement