Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. మా కృతజ్ఞత భావము (ఆడియోతో..)

సభ్యత తెలిసిన వ్యక్తికి ఉండే కొన్ని మర్యాదలు, పద్ధతులను గురించి పైన మనం చర్చించుకున్నాం. ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నింటికీ మేము శివపరమాత్మకు, ప్రజాపిత బ్రహ్మాకు కృతజ్ఞులై ఉంటాము. ప్రజాపిత బ్రహ్మా ద్వారానే దివ్య గుణాలు నిండిన జీవితాన్ని ఆచరించడం ఎలాగో మాకు తెలిసింది. పవిత్రతను చేరుకునే మార్గమును, దివ్య గుణాలను ఆచరించగలిగే శక్తిని పొందే పద్ధతిని శివపరమాత్మ తెలియజేస్తారు. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్ర జీవితాన్ని గడిపే విధానాన్ని వారు వివరించారు. మన కోసం ప్రజాపిత బ్రహ్మా మరియు జగదంబ సరస్వతి ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. ఈ ఉన్నతమైన ఆధ్యాత్మిక శిక్షణను వారు ఎంతో చక్కగా, ప్రేమగా అందరికీ బోధించారు-వారి జీవితాలు అందరికీ ప్రత్యక్ష ప్రమాణాలు. జీవితంలో మనం ఎదుర్కోవలసిన కష్టాల గురించి ఎంతో అద్వితీయమైన పరిష్కారాలను తెలియజేశారు. వారి జీవితాలలో ఈ సుగుణాలను మేము చూసాము, మేము కూడా కృషితో వాటిని మా జీవితంలోకి తీసుకురావాలి అని నిశ్చయించుకున్నాము. ప్రజాపిత బ్రహ్మాను చూసిన తర్వాత ఫరిశ్తా స్థితి లేక అవ్యక్త స్థితి అంటే ఏమిటి అని తెలిసింది? కానీ, అన్నటికీ మించి, ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే మనకు లభిస్తున్న శిక్షణలు, సూచనలు అన్నీ స్వయంగా శివపరమాత్మ ఇస్తున్నవే.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement