Tuesday, November 26, 2024

యోగంలో ఆత్మనిశ్చయ మహత్త్వం

యోగమంటే పితాపరమాత్ముని స్మృతిలో ఉపస్థితులగుట అని భావార్థం. పరమాత్మ శబ్దం పరం ఆత్మతో తయారైనట్టిది. పరమాత్మను ఆత్మ సంబంధంతో పరమపిత అన్నారు కానీ శారీరక సంబంధంతో కాదు. కావున ఆత్మ నిశ్చయం లేకపోతే యోగం కూడా ఆరంభం కాదు. ప్రతిదిన వ్యవహారంలో ఆత్మనిశ్చయ బద్ధులై ప్రవర్తించకపోతే యోగాభ్యాస సమయంలో కూడా మనసు ఏకాగ్రం కాదు. వారికి ఈశ్వరీయ స్మృతి యొక్క ఆనంద రసాస్వాదన కలగదు. నేను ఈ దేహానికి భిన్నమైన ఒక జ్యోతి బిందు ఆత్మను, నేను పరంధామం లేక బ్రహ్మలోకం నుండి ఈ సృష్టియనే రంగస్థలానికి వచ్చాను. ఈ విధంగా నిశ్చయం కలిగి ఉన్నప్పుడే యోగ సోపానాలు అధిరోహించగలరు. ఇప్పటి వరకు కొందరు యోగాసనాలు మరికొందరు దేహధారలైన విష్ణువు, శంకరుడు, రాముడు, కృష్ణుడు, ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలగు దేవీ దేవతలను లేక మహనీయులను భక్తి లేక పూజ చేయుటలో మునిగియున్నారు. కావున పరమపిత పరమాత్మ శివుడు అన్నిటికంటే ముఖ్యమైన అమూల్య రహస్యం మీరు దేహం కాదు పరమాత్మకాదు మీరొక జ్యోతిర్బిందు ఆత్మ. భగవంతుడు కూడా పరమోన్నతమైన ఆత్మ అని ప్రబోధించారు. కావున ఇపుడు మనం స్వయమున ఆత్మ నిశ్చయం చేసుకోవాలి. భగవంతుని పరం ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఇదే సత్యమైన యోగం. ఈ విధంగా ఆలోచించుట చేత యోగ విషయంలో కూడా మన ఉన్నతి అవుతుంది.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement