Saturday, November 23, 2024

సత్యసంధులు మరియు నిజాయితిపరుల సర్వుల ప్రియులు

మనుష్యులు సత్యసంధునిపై నమ్మకాన్ని ఉంచుతారు. అతని సహవాసాన్ని కోరుకుంటారు. ఎందుకంటే అతని నుండి ప్రవిత్రతా ప్రకంపనాలు వస్తూ ఉంటాయి.
వీరికి భిన్నంగా ఉండే వారిని అందరూ దూరంగా ఉంచుతారు. ఎందుకంటే అతడు కుయుక్తిపరుడు. అతితెలివి కలవాడు అని అందరి భావన. అతడి మాటల వెనుక ఏదో ఒక స్వార్థ భావం ఉన్నట్లుగా అనిపిస్తుంది అందుకే ఎవ్వరికీ నచ్చడు. ఒక తెలివైన కపటి ఎప్పుడూ తన అవసరాలను తీర్చుకోవడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అదే నిష్కపటి అయితే, ఇతరుల సంతోషానికి తాను కారణమయినందుకు తనను తాను ఎంతో అదృష్టవంతునిగా భావిస్తాడు.
సత్యత ఉన్నవారిని చూసి భగవంతుడు ప్రసన్నుడవుతాడు అన్న నానుడి ద్వారా కూడా సత్యసంధత, నిజాయితి ఉన్నతమైన గుణాలు అని నిరూపణ అవుతున్నాయి. అవి ఉన్న వారిని భగవంతుడే స్వయంగా దీవిస్తాడు. ఇతర గుణాలన్నీ ఈ గుణాన్ని అనుసరిస్తాయి. కనుక ఈ గుణాన్ని ‘ సర్వ గుణాల పరిచయ కర్త ‘ అని చెప్పవచ్చు.

…బహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీల క్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement