Tuesday, November 26, 2024

సంతోషము ఎందుకు మాయమవుతుంది?

భగవంతుని స్తృతి అనగా యోగము వలన సంతోషము కలుగునట్లు మనం చేసిన పొరపాట్ల వలన సంతోషం మాయమవుతుంది. ఎప్పుడైనా పనికిరాని ఆలోచనలు మనసులోకి వస్తే వెంటనే వాటిని పెద్దల ముందుగానీ, సర్వశక్తిమంతుడైన శివ పరమాత్మ ముందుగానీ ఉంచి వారి నుండి అవసరమైన సూచనలు పొంది మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని హృదయ భారాన్ని తగ్గించుకోవాలి.
గుర్తుంచుకోవలసిన మరో విషయమేమిటంటే, గడిచిన దాని గురించే ఆలోచిస్తూ, బాధ పడుతూ, దురదృష్టవశాత్తూ నేను ఇలా చేసాను. నా ఆధ్యాత్మిక స్థితి బాగాలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. గడిచిన దాని గురించి ఒక గుణపాఠం నేర్చుకుని, ఇక మీదట మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. అపచారం చేసాను అన్న మనోభారంలో నిరంతరం ఉండుట వలననే మన సహజత్వాన్ని కోల్పోతుంటాము. ఒక లోటును సరిదిద్దుకోవడానికి దాని గురించే ఆలోచించడం కాకుండా స్వయం యొక్క ఉన్నత స్థితి గురించిన ఆలోచన అవసరం. బుద్ధిని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంటూ, కలవరంలో కొట్టుకుపోకుండా , ఏ వికారీ ఆలోచన ఆటంకంగా రాకుండా చూసుకోవాలి. ఇటువంటి అనిశ్చితమైన సంఘటనల నుండి జాగ్రత్తగా ఉండాలంటే దివ్య స్పృతి అనే జ్యోతికి ఎప్పుడూ దివ్య జ్ఞానము అనే నూనెను అందిస్తూ ఉండాలి.

…బహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీల క్ష్మి
—————————————

Advertisement

తాజా వార్తలు

Advertisement