ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం వెనుక ఉన్న రహస్యమేమిటంటే ఇతరులు తాము చెప్పేది వినాలి అన్న కోరిక వీరి కి ఉంటుం ది. ఎదుటివారు చెప్పేది వినకపోవడానికి లేక మధ్యలోనే జవాబు ఇవ్వడానికి కారణం వారు వేరే విషయం గురించి చర్చించదల్చుకున్నారు అని అర్థం. ఇతరుల నుండి గౌరవాన్ని ఆశించడం వలన ఇటువంటి ప్రవ ర్తన వస్తుంది. ఈ ప్రక్రియలో ఇతరులను ద్వేషిండం, తమను తాము చూసుకుని గర్వప డటం కూడా జరుగుతూ ఉంటాయి. కానీ సభ్యత తెలిసిన వ్యక్తికి ఒక వేళ ఎవరి ఆలోచనలైనా నచ్చకపోతే అతడు వారు చెప్పేదంతా వింటాడు, తర్వాత ” మీరు చెప్పేది బాగుంది, కానీ…. ” అంటూ చెప్తాడు. ఈ విధంగా వీరు ఇతరులకు గౌరవాన్ని ఇస్తూ తమ భావాన్ని వ్యక్తపరుస్తారు.
….బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గుడూరు శ్రీలక్ష్మి