మనమందరము ఒకప్పుడు శాంతిగా, పవిత్రముగా వుండేవారమే కానీ యదార్థంగా పవిత్రత అనగా ఏమిటి, మన ఆచరణ ఆ సమయములో ఎలా వున్నది?
అపవిత్రత మన ల్ని సంకెళ్లతో బంధిస్తుంది. ఆనురి స్వభావిగా, వికారిగా చేస్తుంది. ఒక విష సర్పము వలె మూర్ఛితులుగా చేస్తుంది అంటే దాదాపు సుషుప్తావస్తలోకి తీసుకెళ్తుంది. పవిత్రత వీటన్నింటి నుంచి ముక్తిని ఇస్తుంది. జ్ఞానము, శాంతి, సంతోషము, శక్తి మరి యు ఈశ్వరీయ నిధులనే ధనాన్ని పెంపొందింప చేస్తుంది.
పవిత్రత ఎంత విలువైన, అతీతమైన గుణం అంటే దాని కొరకు ప్రాణత్యాగం చేయాలి. పాత వ్యక్తిత్వము మరియు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారములనే వికారములు ఏవైతే మన అంగములుగా మారినవో వాటిని సమాప్తం చేయాలి.
పవిత్రత ప్రకాశము వలన ఏ జాతి, ధర్మ, లింగ, వయో, వర్ణ, భేధములు మనల్ని బంధించలేవు. కానీ వీటన్నిటికి అతీతంగా ప్రతి మానవున్ని సోదర రూపంలో అనుభవం చేయిస్తుంది. పవిత్రత శక్తిలో కామ, క్రోధాది వికారాల అగ్ని చల్లారుతుంది మరియు ఆ స్థానంలో శీతల ప్రేమ అభివృద్ధి చెందుతుంది. పవిత్రతను ధారణ చేస్తే పరమాత్ముని సామీప్యంలోకి వచ్చుట యదార్థము.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి