Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌ — వ్యర్థమును సమర్థంగా తయారుచేసే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో 14వది ‘వ్యర్థమును సమర్థంగా తయారుచేసే కళ ‘

వ్యర్థమును సమర్థంగా తయారుచేసే కళ :
ఏ విధముగా పనికిరాని ఇనుమును, బంగారమును కరిగించి ఒక క్రొత్తరూపాన్ని ఇచ్చినట్లుగా బాబా పాత సంస్కారాలను, పాత అలవాట్లను సమాప్తిచేసి చక్కని అలవాట్లు అలవరిచే వారు. వారికి నిరంతరమూ పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా తయారుచేసే శుభసంకల్పమే వుండేది. ఇంటిలో ఏదైనా పాత వస్తువుంలుంటే వాటికి కూడా బాబా క్రొత్త రూపాన్నిచ్చి పనికివచ్చే విధంగా తయారుచేసేవారు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement