మనం అన్ని సమయాలలో భౌతికంగా చురుకుగా ఉండడంతో అది నిశ్చలంగా కుర్చోలేని అసౌకర్యపు లక్షణంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎప్పటికీ కూర్చుని ఉంటే జడత్వం వైపు దారి తీస్తుందేమో అనే భయం వల్ల కదులుతూనే ఉండాలనే బలవంతం వల్ల , నిశ్చలత మరియు నిశ్శబ్దమును నివారించేందుకు మనం చేసే ప్రయత్నం లాగా అనిపిస్తుంది. ఈ బలవంతాన్నిఅధిగమించాలని ఎంచుకుంటే, నిశ్చలంగా అయి ఆలోచించండి మరియు నిశ్శబ్దము అనుభవం చేయండి. మన జీవితం మన సొంతము, పూర్తిగా మనం దానికి యజమాని అనే భావన మనలో నిండుతుంది. ఈ రోజు మౌనంగా కొన్ని క్షణాలు నా లోపలికి దృష్టిని నిలపడం ద్వారా, భౌతిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి పరివర్తనం చెయ్యనివ్వండి.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి