రెండవది, ఈ గుణానికి మరో రూపం ఉంది. ఈ ఇంద్రియాల ద్వారా ఏది చూసినా దానిని ఆత్మ జ్ఞానముతో అన్వయించుకోగలగాలి. నేను నా ఇంటిని చూసిన వెంటనే ఆత్మ ఇల్లు పరంధామము అని గుర్తుకు రావాలి. ఒక కారును చూసిన వెంటనే- ఈ శరీరం ఒక కారు వంటిది, నేను ఆత్మను, శరీరానికి భిన్నంగా ఉన్న నేను, దాని డ్రైవరును అన్న ఉత్సాహవంతమైన ఆలోచన కలగాలి. ఈ రోజుల్లో మనిషి దృష్టి బాహ్యంగానే ఉంటుంది అన్నది మనం సర్వ సాధారణంగా గమనిస్తున్న విషయం, ఇంద్రియాల ద్వారా మనిషి తన మనసును బాహ్య ప్రపంచంలో ఉన్న ఒక వస్తువు నుండి మరొక వస్తువు వైపుకు మరలుస్తున్నాడు కానీ ఒక్కసారి కూడా తన స్వరూపం వైపు అనగా ఆత్మను గుర్తుచేసుకోవడం లేదు. వస్తు వైభవాల వెంట పరుగెడుతూ మనిషి తనను తాను మరియు తన తండ్రిని మర్చిపోయాడు. కనుక, అంతరంగంలోకి చూసుకోవడం అవసరం.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి