Wednesday, September 18, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అసలు అంతర్లీనము అంటే ఏమిటి? (ఆడియోతో…)


అంతర్లీనము అనగా మనం నిరంతరం అంతరంగంలో లీనమై ఉండటం అనగా ఆత్మ స్థితిలో లీనమై ఉండటమని అర్థం. ఉదాహరణకు, బాహ్యప్రపంచ దృశ్యాలను చూస్తున్నప్పుడు అందులోనే మునిగిపోక, వీటిని చూస్తున్నది స్వయం అనగా ఆత్మ, దేహం ద్వారా ఈ దృశ్యాలను చూస్తుంది అని గుర్తుంచుకోవాలి. కళ్ళు కెమెరా లేక లెన్సువంటివి. చూసిన దృశ్యాన్ని ఈ కళ్ళు మెదడుకు పంపుతాయి. కానీ మనం అనగా ఆత్మలమైన మనం, చైతన్య స్వరూపులమైన మనం వీటికి యజమానులం. మనం మాట్లాడుతున్నప్పుడు, మన నోరు ఒక మైక్రోఫోన్‌ వంటిది మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అంత:స్వరూపము అనగా ఆత్మ నోటిద్వారా మాట్లాడుతుంది. కనుక ప్రతి కర్మలోను మనల్ని మనం ఒక దేహంగా కాక భృకుటి మధ్య నివసిస్తున్న ఆత్మగా భావించాలి. అంటే అంతర్లీనము అనగా ఆత్మిక స్థితిలో ఉండడము అని అర్థం. ఈ శరీరం ద్వారా ఎన్నో పనులు చేస్తూ కూడా దానిపై నిర్మోహత్వమును కలిగి ఉండటమే అంతర్లీనములోని భావం.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement