Tuesday, November 26, 2024

పరమానందకరం… బాబా లీలామృతం

శ్రీ సాయి తన భక్తులకు ఇచ్చే విభూతి ఎంతో మ#హమాన్వితమైనది. అది భక్తుల అనితర సాధ్యమైన రోగా లను తగ్గించడమే కాక వారి మానసిక సమస్యలను, చింతనలను, కష్టా లను, కన్నీళ్ళను దూరం చేసేది. భౌతికమైన కోరికలను తీర్చడమే కాక ఆధ్యాత్మిక జాగృతిని కలిగించడంలో శ్రీ సాయినాథుని ఊదీ సంజీవ ని వలే పని చేసేది. విభూతిని రాయడం వలన, నీటితో కలిపి తీర్ధం వలే లోపలికి సేవించడం వలన ఎంతోమంది స్వస్థత పొందారు. అటువం టి ఒక లీలను ఇప్పుడు మనం స్మరించుకుందాము.
శ్రీ సాయికి అంతరంగికుడు, నిష్కల్మష భక్తుడైన శ్యామా (మాధ వరావు దేశ్‌పాండే) తమ్ముడు శావల్‌ వి#హర్‌ అనే గ్రామంలో వుంటు న్నాడు. ఒక రోజున అకస్మాతుగా అతని భార్యకు ప్లేగు వ్యాధి సోకింది. డాక్టరు ఇచ్చిన మందులు పని చెయ్యలేదు. ప్లేగు బొబ్బలు శరీరమం తటా వ్యాపించసాగాయి. తనకు సహాయం చెయ్యమని బాపాజి శ్యామాకు కబురు పెట్టాడు. కబురునందుకున్న శ్యామా పరుగు పరు గున వచ్చి శ్రీ సాయి కాళ్ళపై పడి తన మరదలిని రక్షించమని ప్రార్ధించి శావుల్‌ వి#హర్‌ వెళ్ళడానికి అనుమతి కోరాడు.
శ్రీ సాయి చిరునవ్వుతో అభయ #హస్తం అందించి ”శ్యామా! ఎం దుకలా కంగారు పడతావు? ఇప్పుడేమైందని? ప్లేగు చాలా సామాన్య మైన వ్యాధే కదా! ఈ విభూతిని వారికి పంపించు, రేపు ఉదయాన్నే వెళ్ళి వెంటనే వచ్చేసేయ్‌! ఆవిడ జ్వరం తగ్గి హాయిగా వుంటుంది” అని అన్నారు. బాబా ఆజ్ఞను శిరసా వ#హంచాడు శ్యామా. తన అన్నగారు పంపించిన విభూతిని భార్య నుదిటిపై కొంత పెట్టి మరికొంత నీటిలో కలిపి తీర్ధం వలె త్రాగించాడు శ్యామా తమ్ముడు బాపాజి. శ్రీ సాయి విభూతి దివ్యౌషధం వలే పని చేసింది. ఆమెకు హాయిగా నిద్ర పట్టింది. ఉదయం తనకంటే ముందుగా నిద్ర లేచి తన పనులన్నింటినీ చకచకా చేసుకుంటున్న భార్యను చూసి బాపాజీ ఆశ్చర్యపోయాడు. ఆమె వంటిపై ఇంతకుముందు ప్లేగు వచ్చిన సూచనలు కూడా లేవు. శ్రీ సా యి విభూతికి వున్న అపూర్వమైన శక్తికి ఆశ్చర్యపోవడమే కాక మనస్సులో వ్యాధి నివారణ చేసినందుకు శ్రీ సాయికి శత స#హస్ర కోటి కృతజ్ఞతాభివందనములను అర్పించుకున్నాడు. శ్రీ సాయి చేసిన అపూర్వ, దివ్య లీలను తమ్ముని ద్వారా తెలుసుకొని

దివ్యా నందభరితుడ య్యాడు. శ్రీ సాయి వా క్కు బ్ర#హ్మ వాక్కు. అమృతంతో సమానం. ఆయన మాట్లాడే ప్రతీ మాట అక్షర సత్యాలని శ్యామా సోదరులు మరొక్కమారు అనుభవ పూర్వకంగా తెలుసుకు న్నారు. శ్యామా శిరిడీకి తిరిగివచ్చి శ్రీ సాయి కాళ్ళపై పడి కృతజ్ఞతలు అర్పించుకున్నాడు. అప్పుడు శ్రీ సాయి ”జరిగినదంతా నీకు తెలుసు. నేను ఏ పనిని చెయ్యకపోయినా సర్వానికీ కర్తగా అందరూ నన్ను భావిస్తున్నారు. భగవంతుడే సర్వ శాసనకర్త. ఎవరైతే ఆ భగవంతుని గొప్పదనాన్ని గుర్తించి, నిత్యం ఆయనను భక్తిశ్రద్ధలతో సేవిస్తూ, కీర్తిస్తారో వారిని ఆ భగవం తుడే ఎల్లవేళలా వెంట వుండి కాపాడుతూ వుంటాడు. వారికి కావల్సి నవన్నీ సమకూరుస్తుంటాడు.” అని బోధ చేసారు. మన నిత్య జీవితం లో దైవాన్ని నిరంతరం గుర్తుంచుకోవాల ని శ్రీ సాయి మనకు తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement