Wednesday, November 13, 2024

ఆశీర్వచనం… ఓ కవచం!

మన ధర్మశాస్త్రాల్లో నమస్కారానికి అత్యంత ప్రాధాన్యత వుంది. పెద్దవాళ్ల దగ్గరకు వెళ్ళి నప్పుడు నమస్కరించి ఆశీర్వచనాలు తీసు కోవడం, ఇద్దరు వ్యక్తులు తారసపడినప్పుడు గౌరవ పూర్వకంగా నమస్కరించుకోవడం, ఇద్దరు అహంకా రులు తమ అహంకారాన్ని విడనాడి ఒకరికొకరు నమ స్కరించుకుంటే వారిద్దరి మధ్య సఖ్యత కుదరడం లాంటి సత్ఫలితాలు కలుగుతాయి. నమస్కారం మని షి సంస్కారానికి చిహ్నం. నమస్కారం చేసే సంస్కా రం వున్న మనిషికి విలువ పెరుగుతుంది. పెద్దల శుభా శీస్సుల వల్ల అన్నిటా విజయం లభిస్తుంది.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్ముల వారితో దుర్యోధనుడు ”మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నా రు” అని వ్యంగ్యంగా అంటాడు. ఆ మాటలకు బాధ పడి భీష్మ పితామ#హడు వెంటనే ”నేను రేపు పాండవు లను చంపుతాను” అని ప్రకటించాడు.
అంతే… ఆ సమాచారం తెలిసిన పాండవుల శిబి రంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురిం చి అందరికీ తెలుసు కాబట్టి, భయంతో కలవరపడ్డా రు. వారికి ధైర్యం చెప్పి శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.
శ్రీకృష్ణుడు శిబిరం బైటే నిలబడి ద్రౌపదితో ”నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన ”అఖండ సౌభా గ్యవతీ భవ” అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమ నించు అన్నాడు.
ద్రౌపది శిబిరంలోపలికి వెళ్ళి భీష్ములవారికి నమస్కరించింది. ఆయన శ్రీకృష్ణుడు చెప్పినట్లే ”అఖండ సౌభాగ్యవతీ భవ” అని దీవించాడు. ఆ తర్వాత ”ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు. నిన్ను కృష్ణుడు తీసుకువచ్చాడు కదా” అని అడిగాడు. దానికి ద్రౌపది ”అవును పితామహా! అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు” అంది. అప్పుడు భీష్ముడు శిబిరం బయటకు వస్తాడు. అక్కడున్న శ్రీకృష్ణుడు- భీష్ముడు ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు.
వెంటనే భీష్ముడు.. నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞకన్నా దీవెనకు ఎక్కువ ప్రభావం. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అని ఒక మార్గం సూచించాడు. శిబిరం నుం డి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీకృష్ణుడు ద్రౌపదితో ”నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ సౌభాగ్యం నిలబడింది. నీ భర్తలు ఆయుష్షును పొందారు. ఇలా గే.. నీవు ప్రతిరోజూ పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అంతా మంచే జ రుగుతుంది. ఒక్క నమస్కారానికి మాత్రమే అంతటి భాగ్యం కలుగుతుంది” అన్నాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లే ద్రౌపది పెద్దలందరికీ నమస్కరి స్తూ వుండేది. వారు ”అఖండ సౌభాగ్యవతీ భవ” అని దీవించేవారు. దాంతో పాండవులకు ఎటువంటి ప్రాణ హాని కలగలేదు. ధర్మయుద్ధంలో విజేయులయ్యారు. ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోకపోవడం. అ#హం కారంతో ఎదుటివారిని చులకనగా చూడడం వలన అనర్ధాలు జరుగుతున్నాయి.
ఇంటిలో వున్న వారందరూ ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీ ర్వాదాలు కవచంలాగా పనిచేస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement