Saturday, September 21, 2024

రత్నాల ఆవిర్భావం బలాసురుని త్యాగం!

”వినుము మాణిక్య మౌక్తిక విద్రుమములు, గరుడ పచ్చయు పుష్యరాగంబు వజ్ర నీల వైదూర్య గోమేధికంబు లనంగ, వేరయు తొమ్మిది నవరత్నములంద్రు||”
అనగా మాణిక్యం, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, వైఢూర్యం, గోమేధికం- ఇవి నవరత్నాలు. మా ణిక్యాన్ని కెంపు అని కూడా అంటారు. ఈ రత్నాల పుట్టుక గు రించి గరుడ పురాణం పేర్కొంది.
ప్రాచీన కాలంలో ‘బలాసురుడ’ ను రాక్షసుడుండేవాడు. ఇంద్రాది దేవ తలందరినీ యుద్ధంలో జయించి తన త్రైలోక్యాధిపత్యాన్ని లోకానికి చాటుకు న్నాడు. బలాసురునికి ”ఇచ్చిన మాట ను తప్పకూడద”నే నియమం వుండేది. దేవతలు బ్రా#హ్మణ వేషాలలో అతని వద్దకు వెళ్ళి తామొక యజ్ఞాన్ని తల పెట్టామనీ బలిపశువు కోసం అతనిని యాచించడానికి వచ్చా మనీ బలాసురుని బతిమాలుకున్నారు. అతడు వెంటనే వారికి కావలసిన బలిని తాను సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెనువెంటనే దేవతలు ”నువ్వే కావాలి” అన్నారు. ఈవిధంగా తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు. బలాసురుని బలిదానం ఉత్తినేపోలేదు. లోకకల్యాణం జరి గింది. త్రైలోక్య కల్యాణమే జరిగినది.
బలాసురుని శరీరము ఈ విశుద్ధ కర్మ వలన పరమ విశుద్ధ శరీరముగా పరిణతి చెంది, సత్త్వగుణ సంపన్న మై విరాజిల్లినది. అందలి అన్ని అంగములూ రత్నబీ జములై ప్రపంచమునే సుసంపన్నము గావించినవి. దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు, ఆ బలాసురు ని శరీరాన్ని ఆకాశమార్గంలో గొనిపోసాగినారు. యాత్రావేగంవల్ల అతని శరీరం తనంతటతాను ముక్కలైపోయి అక్కడక్కడ పడినది. సము ద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదానాల్లో ఎక్కడె క్కడ అత్యల్పపరిమాణం ఆ మహాదాత శరీర శక లాలు పడ్డాయో, అక్కడక్కడ, రత్నాల గనులేర్పడ్డా యి. వాటి నుండి వెలికితీయబడిన రత్నాలకూ (వ జ్రాలకూ) అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది.
రత్నాలలో వజ్రం, ముక్తమణి, పద్మరాగం, మర కతం, ఇంద్రనీలం, వైదూర్యం, పుష్యరాగం, కర్కేత నం, పులకం, రుధిరం, స్పటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్ష ణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి.
వజ్రం: బలాసురుని ‘ఎముకలు’ ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్క డ అవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. #హమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణ్వాతట, సౌ వీర అను పేర్లు గల ఎనిమిది భూభాగాలు వజ్ర క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
ముత్యాలు: బలాసురుని ‘ముఖము’ నుండి రాలిన దంత పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ సముద్రంలో పడింది. అలా పడిన బలాసురుని ‘పలువరస’ సాగర తీర దేశాలు, ద్వీపాలునైన పౌరాష్ట్ర, తామ్రపర్ణ, పాండ్య, హాటక, సిం#హళ ప్రాంతాలు ముత్యాలకు ఖజానాలు అయ్యాయి.
పద్మరాగమణులు: బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత ‘రక్తాన్ని’ తీసుకొని వెళుతుండగా వినీలాకాశ మార్గంలో లంకపై నుండి పోతున్నపుడు లంకాధి పతియైన రావణుడు అడ్డగించాడు. వారి పెనుగులాటలో ఆ రక్తం క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది. ఆ నదిలో దొరికిననే పద్మరాగమణులు.
మరకత మణులు: నాగరాజు వాసుకి బలాసురుని ‘పిత్తాన్ని’ తీసుకొని వేగంగా దేవలోకం వైపు సాగిపోతుండగా, పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడిచేశాడు. వాసుకి పరుగెడుతున్న పుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని పానం చేయడంతో మైకం కమ్మింది. ఆ తర్వాత ఆయన రెండు నాసికా రంధ్రాల ద్వారా వెలువడి నేలపైబడిన ఆ పిత్త భాగము కాంతి తో మెరిసే మరకతాలకు గనిగా మారింది.
ఇంద్రనీలమణులు: సిం#హళదేశపు రమణులు లవలీ అనే సుగంధిత పుష్పాల వాసనలతో మనసును దోచే వృక్షాలనూ, పొగడలనూ తమ కరాగ్రాల స్పర్శచే కరుణిస్తుంటారో అక్కడ మహాదాత బలాసురుని వికసిత కమల సదృశ శోభలతో వెలిగే ‘కన్నులు’ వచ్చి పడినవి. రత్న సమాన కాంతులీను ఆ నేత్ర ప్రభతో సముద్ర తీరమంతా వెలుగుల మయమై భాసించి, ఇంద్రనీలమణులకు గని కూడా ఏర్పడింది.
వైదూర్యం: బలాసురుని ‘వాదం’ ప్రళయకాల కుభీత సముద్ర ఘోషవలె నున్నపుడు దాని నుండి వివిధ వర్ణాలు గల, సౌం దర్య సంపన్నములైన వైదూర్యాలుద్భవించాయి. (వైడూర్య మనే మాట తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది. కానీ సం స్కృత మూలం విదూరజ, వైదూర్య)
పుష్యరాగమణి: పుష్యరాగ (పుష్కరాగ) మణి బలాసురుని ‘చ ర్మం’ #హమాలయ పర్వతంలో పడిన చోటి నుండి ఉద్భవిం చింది. ఇది మహాగుణ సంపన్నం.
స్ఫటిక రత్నం: ఇది మనకు బలరాముడిచ్చిన వరం. ఈయన బలాసురుని ‘మేదా’ భాగాన్నందుకొని కావేరి, వింధ్య (నేటి చైనా), నేపాల ప్రాంతాల్లో ప్రయత్నపూర్వకంగా వెదజల్లాడు. ఆకాశ సమాన నీలవర్ణంలో తైల స్ఫటిక అను పేరు గల రత్నా లు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్నాయి.
విద్రుమమణి: ఇది ఆదిశేషునిచే భూలోకానికి ప్రసాదింపబ డింది. ఈయన బలాసురుని ‘ఆంధ్ర భాగాన్ని’ గ్ర#హంచి కేర ళాది దేశాలలో వదిలాడు.
ఈ విధంగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువు, బ్రహ్మ మనకు ప్రసాదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement