Friday, November 22, 2024

భీమశంకర జ్యోతిర్లింగం

శ్లో॥ యం ఢాకిని శాకినికా సమాజై:
నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాది పద ప్రసిద్ధం
తం శంకరం భక్తహితం నమామి ॥

భావ‌ము : మాంసమును తినే దాకిని శాకినీ సమూహములు చేత సేవింపబడుతూ.. భీముడు (లేక భయంకరుడు) అను పేరుతో ప్రసిద్ధుడైనా, భక్తులకు శుభములను కలిగించు శంకరునకు నమస్కరిస్తున్నాను. (ఇక్కడి అమ్మవారిని బ్రహ్మ కమలముతో పూజించుట చేత “కమలజు” అని పిలువబడుతోంది.)

పురాణగాథ:
ప్రస్తుత పూనా నగరమునకు సుమారు 100 మైళ్ళ దూరములో గల సహ్య పర్వత మందలి ఢాకినీ శిఖర ప్రాంతమున పూర్వము కర్కటుడనే రాక్షసుడు పుష్కసి అను పేరు గల తన భార్యతో నివసిస్తూ వుండేవాడు. వారి కుమార్తె పేరు ‘కర్కటి’ ఆమెను ‘విరాధుడు’ అనువానికిచ్చి పెళ్ళి చేశారా రాక్షస దంపతులు. శ్రీరాముడు విరాధుని చంపిన తర్వాత ‘కర్కటి’ తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు సహ్యాద్రికి వచ్చి చేరెను.

ఢాకినీ శిఖరము నుండి పుట్టిన భీమానది యందు స్నానము చేయుటకు అగస్త్య | మహర్షి శిష్యుడైన సుతీక్షణుడు’ అనువాడు వచ్చాడు. కర్కట పుష్కసులను రాక్షస దంపతులా ముని కుమారుని భక్షింపబోవగా నతత తన తపోబలముచే వారిని భస్మము చేశాడు. ఇదంతయు చూస్తున్న కర్కటి అప్పటి నుండి దిక్కులేనిదై ఒక్కతియే అసహ్య పర్వతమున కాలము వెళ్ళబుచ్చుతోంది. ఒకనాడు రావణాసురుని సోదరు జైన కుంభకర్ణుడు సహ్యపర్వతమునకు వచ్చినపుడు ఆమెను చూసి బలాత్కారముగా ఆమెను లోబరచుకొని, అక్కడ ఆమెతో కొన్నాళ్ళు విహరించి లంకకు తిరిగి వెళ్ళి పోయాడు. గర్భవతియైన కర్కటి ఒక కుమారుని కని వానికి భీముడని పేరు పెట్టింది.

ఆ భీముడు పెరిగి పెద్దవాడై ఆ సమీపమందలి ప్రజలను పలు విధాలుగా పీడించేవాడు. అతడొకనాడు ప్రసంగవశమున తన తండ్రి యెవరని తల్లిని (కర్కటిని) అడిగాడు. అపుడామె తన తల్లిదండ్రుల గూర్చియు, తన మొదటి భర్త (విరాధుడు) గూర్చియు, చెప్పి, కుంభకర్ణుడు తనను చేపట్టుట వలన నీవు పుట్టితివని చెప్పింది. మరియు రామరావణ యుద్ధమున రావణ, కుంభకర్ణాది మహావీరులందరూ చనిపో యారనీ, వారివలెనే నీవునూ ముల్లోకములను జయించి వారి కీర్తిని నిలబెట్టుమని భీముని కోరింది. నాటి నుండి అతడు విష్ణుభక్తులను, ఆశ్రమవాసులగు మునులను వెతకి వెతకి హింసించేవాడు. ఆ సహ్య పర్వతమున బ్రహ్మకై తపస్సు చేసి అతని నుండి కావలసిన వరములను పొందాడు.
శ్రీ భీమాసురుడు వర గర్వముతో దేవతలపై దండెత్తి ఇంద్రుడిని పదవీభ్రష్టుని చేశాడు. దిక్పాలకులతనికి భయపడి పారిపోయారు. తర్వాత భీముడు మర్త్య లోకము (ఈ భూమిని) జయించాలనుకున్నాడు. ఆ కాలమున కామరూప దేశము (ప్రస్తుత నేపాల్)ను సుదక్షిణ్యుడనే రాజు పరిపాలించేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. భీముడు మొదట కామరూపము పై దండెత్తి సుదక్షిణుడి నోడించి కారాగారమును బంధించాడు.
భీమాసురుని చెరసాలలో బందీలైన సుదక్షిణ మహారాజు దంపతులు శివభక్తిని విడువక తమ యెదుట పార్ధివ శివలింగము నుంచుకొని దీక్షగా పరమేశ్వరుని పూజించేవారు. ఈ విషయమును తెలిసికొనిన భీమాసురుడు కారాగారమునకు వచ్చి ఆ రాజు దంపతులను, పార్ధివ శివలింగమును పరిహసిస్తూ దూషించాడు. దానికి సుదక్షిణ మహారాజు “భీమాసురా! శివుని మహిమ తెలియక నీవు దూషిస్తున్నావు. శివుడు భక్తులను రక్షించుటే కాక నీ వంటి పాపులను శిక్షిస్తాడు కూడా” అని అతడిని మందలించాడు. దానితో భీముడు కోపమును పట్టలేక చేతిలోని కత్తిని ఆ రాజు పూజిస్తున్న పార్ధివలింగము పైకి విసిరాడు. దాంతో ఆ పార్ధివ లింగము నుండి శివుడుద్భవించి తన మూడవ కంటితో భీమాసురుని, అతని రాక్షస గణములను భస్మము చేశాడు. సుదక్షిణ మహారాజు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు శివుని స్తుతించారు. అక్కడ భీమాసురుడు చంపబడడం చేత భీమశంకరుడుగా తాను జ్యోతిర్లింగమవుతానని, భక్తులను రక్షించి సకల శుభముల నిచ్చెదనని శివుడు వరమిచ్చాడు. సుదక్షిణుడు తన కామరూప దేశమునకు తిరిగి వెళ్ళిపోయినను ప్రతి మాసశివరాత్రికి అక్కడకు వచ్చి భీమశంకరుని పూజించేవాడు. రాక్షస సమూహములు భస్మము చేయబడగా ఆ బూడిద కాలాంతరమున ఓషధులుగా రూపొందాయి. భీమశంకరుడను పేరు గల శివలింగములు పైన తెల్పిన మహారాష్ట్రలోని ఖేడ్ ప్రాంతముననే గాక (1) ఉత్తరప్రదేశ్లో నైనిటాల్లో 20 కి.మీ.లో ఉజ్జనక్ అనే గ్రామంలో ఒకటి; (2) అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుర పర్వతముపై ఒకటి; (3) ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాలోని దక్షారామమున ఒకటి ఉన్నాయి..

- Advertisement -

పంచారామములు అని పిలువబడే 1. దక్షారామము, 2. అమరారామము (అమరావతి-కృష్ణాజిల్లా), 3. కుమారారామము (సామర్లకోట), 4. క్షీరారామము (పాలకొల్లు), 5. సోమారామము (గుణుపూడి-భీమవరం) అయిదును శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రములు.

చరిత్ర: చెప్పుకోదగినంతగా లేదు – శివాజీ తర్వాత మహారాష్ట్రను పాలించిన… పిష్వాలలో నానా ఫడ్నవీస్ “అనునతడు శ్రీ స్వామి వారికి అందమైన ఆలయాని నిర్మించి ఈ క్షేత్రాభివృద్ధికి చాలా కృషి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement