సృష్టి క్రమంలో కాలం అంతర్భాగంగా ఉంది. కాలము ముందుకు సాగుతూనే ఉం టుంది. ఎవరి గురించి కాని, ఎవరు ఆజ్ఞాపించినా కాలమేమీ ఆగదు. కాలానికి ఉన్న శక్తి అమోఘమైనది. ఎంతో విలువైనది కూడా. ఎందుకంటే హరిశ్చంద్రు మ హారాజు, నల మహారాజు వంటివారు సైతం కాలానికి తలదించక తప్పలేదు. కాలం కలి సొస్తే కింకరుడే రాజు అవుతాడని నానుడి. మనలో చాలామంది ”కాలం కలిసి రావట్లేదం డి. మా అమ్మాయికి వివాహం నిశ్చయం కావడంలేదు.” అనో మా అబ్బాయికి ఉద్యో గం రావటంలేదనో, మనసులోని బాధను వ్యక్తం చేస్తూ తప్పు అంతా కాలం మీదే అభాంఢం వేస్తూంటాము. అందుకే పిదప కాలం, కలికాలం, వంటి మాటలు పుట్టు కొస్తున్నాయి.
”బుద్ధిమంతులు వివేక వంతులు గడిచిపోయిన సంఘటనల గురించి శోకించరు. వాటి నుండి ఒక అనుభవాన్ని పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి చింతన ఏమీ ఉం డదు. వర్తమానంలో తమ కర్తవ్యాన్ని విస్మరించకుండా నిర్వ#హస్తూంటారు.” అని పెద్దలు చెబుతారు.కాలం, కెరటం ఎవరి గురించి ఎదురు చూడవు. (టైం టైడ్ వెయిట్ ఫర్ నన్) అని ఆంగ్లంలో సామెత ఉంది.
కాలాన్ని సృష్టి క్రమంలోనే భూత, భవిష్యత్తు, వర్తమానం అని మూడు రకాలుగా కాలాన్ని గుర్తించారు. మనిషికి తన జీవితంలో ఎన్నో సుఖ- దు:ఖాలకు లోనై ఉంటాడు. వాటిని కాలమే మరిపింపచేస్తుంది. ఈ క్రియ లేకపోతే, గత స్మృతులను గుర్తుకు తెచ్చు కొంటూ, నిత్యం దు:ఖావేశంలోనే జీవించే పరిస్థితి నెలకొంటుంది.
కాలం విలువ
కాలం విలువను ఆదిశంకరాచార్యులు వారు తమ ‘ప్రబోధ సుధాకరం’లో ఇలా వివరించారు.
”ఆయు: క్షణ లుక మాత్రం నలభ్యే హేమకోటిభికాపి:
తచ్చేద్గతి సర్వం మషా తత: కాధికాహాని:”
అంటే ఆయువు ఉన్నంతకాలం ఎంతో విలువైనది. కోట్ల కొలదీ బంగారు నాణాలు ఇచ్చినా క్షణ కాలంలో ఇసుమంతైనా ఆయువును పొందలేము. కాబట్టి ప్రాణం (ఆయు వు) ఉన్నప్పుడే మంచి చేసి, సుఖం జీవనానికి, ధార్మిక జీవనానికి బాటలు వేయాలి అని. వర్తమాన కాలంలో మనిషి తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని, క్రమం తప్పకుండా సమయ పాలన (కాలాన్ని నిర్ణయం) చేసుకొని ముందుకు సాగుతుంటే, కాలం ప్రణాళిక ప్రకారం వృధా కాకుండా ఉంటుంది. జీవన సాఫల్యతకు ఇదే మార్గం.
తల్లి గర్భంలో ఉన్న శిశువు నెలనెలా క్రమక్రమంగా ఎదిగి నవమాసాలు తర్వాత ఈ పుడమి తల్లి ఒడిలోకి వస్తాడు. మనిషి ఆయుష్ వంద సంవత్సరాలు అంటారు. ఈ రెండు విషయాలు భగవ నిర్ణయం. అంటే కాలపురుషుడు పరమాత్మే అని విశిదమవుతోంది.
గతించిన కాలాన్ని, ఆయువును, పరువును మరల పొందలేము. ఒకవేళ పోయిన పరువు, తిరిగి కొంతవరకు పొందినా, ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. కాలప్రభావం వల్లనే హంసతూలికా తల్పాలు, అధికార దర్పంతో ఉండవలసిన పాండవులు అరణ్యవాసం, కురుక్షేత్ర యుద్ధం చేయవలసి వచ్చింది.
కాలప్రభావం వల్లనే, తెల్లారితే పట్టాభిషిక్తుడవ్వవలసిన శ్రీరాముడు, సీతా, లక్ష్మణ సమే తంగా అరణ్యవాసం చేయవలసి వచ్చింది కదా.
మాండవ్య మ#హర్షికి తన భర్త కాలు తగిలిందనే ఉద్దేశంతో, తెల్లవారేలోగా మరణిం చుగాక! అని ఇచ్చిన శాపం, నెరవేర కుండా, తన ప్రాతివత్య మ#హమతో, కాలాన్నే స్థంభిం ప చేసిన సుమతి మనకు తెలుసు. కాలం స్థంభించడంవల్ల, నిత్యానుష్టానం, ఇతర కార్యక్ర మాలు ఆగిపోయాయి. తరువాత అనసూయ, సుమతిని ఒప్పించి, కాలాన్ని ముందుకు సాగేందుకు ఆమె శాపాన్ని నివారింపచేసింది. ఇది ఒక అపూర్వ సన్నివేశం. సుమతి మహా పతివ్రత, కాబట్టి ఆమె భర్తను రక్షించుకోవడంలో ప్రకృతినే కదలకుండా చేయ గలిగిన సాధ్వి.
అశోక వనంలో సీతను దర్శించిన సందర్భంలో హనుమతో, సీతాదేవి ”ఇంక నాకు రెండు నెలల గడువు మాత్రమే ఉంది. ఈలోగా శ్రీరాముడు వచ్చి నన్ను రక్షించాలి. లేకపోతే ఇక నాకు అగ్నిప్రవేశమే గతి.” అని కాలాన్ని గుర్తుచేసింది.
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా?
మనకు ఇతిహాసాలు, పురాణాలు ఎన్నో మార్గదర్శకాలు సూచించాయి. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో, వారు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారి పురో#హతుడు ధౌమ్యుడు, పరాసర మహర్షి, వ్యాసమహర్షి వంటి ఎందరో మ#హర్షులు, పాండవులను సందర్శించినప్పుడు, వారి సూచనలు, సలహాలు, మేరకు తీర్థయాత్రలు చేసి, ఎంతో జ్ఞానం పొందారు. అంతేకాక ధర్మాచరణ, ఆశ్రమ ధర్మాలు, ఎన్నో ఉపయుక్త మైన విషయ జ్ఞానాన్ని ఆర్జించారు.
శ్రీరాముడు, వనవాసం సందర్భంలో మహర్షుల ఆశ్రమాలు సందర్శించి, వారి నుం డి జ్ఞానాన్ని పొందడం విశేషం. తన అరణ్య వాసంలోనే భక్తి శబరికి మోక్షప్రాప్తి కలిగించ డం, అహల్యా శాపవిముక్తి కలిగించడం తటస్థించింది.
నేటి యువతరం కాలాన్ని, అనవసరమైన విషయాలతో వృధా చేస్తున్న సంగతి మన కు అవగతమే. ఒక ప్రణాళిక (విజన్) ఉండాలి. దాని సాధనకు కృషి చేయాలి. ఈ వర్తమాన కాలంలోనే, భవిష్యత్తుకు పునాది వేయాలి. పోయిన కాలం పోయిన సంపద తిరిగి పొంద లేము అని మరోసారి గుర్తు చేసుకొందాం. అంటే మనం మన కర్తవ్యాన్ని, విస్మరించకుండా జాగ్రత్త పడాలి.
శాస్త్రీయ విజ్ఞానం చాలా వేగంగా. ముందుకు సాగుతోంది కాని నేటి యువతరం సమాంతరంగా ఎదగడం లేదు. దీనికి కారణం, మన చుట్టూ ఉన్న సమాజంలోని దుర్గు ణాలకు బానిసలుగా మారడమే. ఇది గుర్తించి, శాస్త్రీయతతో ముందుకు సాగాలి. కాలం లో సంభవించే మార్పులు సహజం.
ప్రస్తుత కాలాన్ని మనం చేసే పనిని బట్టి ఆధ్యాత్మికతకు, కుటుంబ సభ్యులతో గడపడానికి, కర్తవ్య నిర్వహణకు, వ్యాయామానికి, స్నేహేతులతో సరదాగా కాలక్షేపం చేయడానికి ఇలా కాల విభజన ముఖ్యం. దీనివల్ల క్రమశిక్షణ, పద్ధతిగా మనగలగడం అలవడతాయి.
శ్రీ శ్రీ శంకరాచార్యులు వారు తమ భజగోవిందం శ్లోకాల్లో
”దినయామిక్యా సాయం పాత్ర:
శిశిర వస్తనౌపునరాయాత:
కాల: క్రీడతిగచ్చత్యాయు:
తదపిన ముచత్యాశా వాయు:” అంటే పగలు- రాత్రి గడిస్తే రోజు అవుతుంది. ఇలా ఎన్నో రోజుల గడుస్తున్నా, శిశిర ఋతువు తరువాత, వసంత ఋతువు, గడుస్తూ ఒకదాని తర్వాత మరొకటి వస్తూపోతూ ఉంటాయి. కాలం ఆడే ఆటలో వయసు తీరిపోతుంది. అయినా మనిషికి ఆశ అనే వాయువు విడవకుండా ఉంది.” అని.
దీన్ని బట్టి అయినా మనం, ఇక నుండి కాలాన్ని సద్వినియోగం చేసుకొంటూ, ముం దుకు సాగుతూ, జీవితానికి అర్థం- పరమార్థం కలిగించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.
‘విజన్’తో ముందుకు సాగుదాం.