Friday, November 22, 2024

భస్మధారణంసనాతన వైదిక సంప్రదాయం!

”ఆదిశంకరులు అద్వైత మతస్థులు కదా! మరి ఆయన శైవమత చిహ్నాలైన విభూది ధరిం చారు. ఎందుకు? వారి సంప్రదాయం వారు శైవులా?” అని ఓసారి సామవేదం షణ్ముఖశర్మగారిని కొందరు ప్రశ్నించారు. దానికి శర్మగారు ఇలా సమా ధానమిచ్చారు.
అద్వైతానికి శివకేశవుల మధ్య భేదం ఉండదు. భస్మధారణం సనాతన వైదిక సంప్రదాయం. సనా తన వేద మతంలో శివకేశవ భేదాలు లేవు. మనది యజ్ఞ సంస్కృతి. నిత్యం అగ్నిహోత్రారాధన, య జ్ఞం, సమస్త దేవతలనూ అగ్ని ద్వారా ఉపాసించడం వేద పద్ధతి. ఆవిధంగా అగ్ని ఆరాధనాదులు చేశాక, మిగిలేది భస్మం, దానిని యజ్ఞప్రసాదంగా నిత్యం ధరిస్తారు. త్రిపుండ్రాలు (భస్మంతో ధరించే) త్రేతాగ్ను లకు (గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులు), ఓం కారంలోని మూడు వర్ణాలకు, త్రిమూర్తులకు, త్రిశ క్తులకు సంకేతం. వేదంలో భస్మధారణ మంత్రాలు న్నాయి. ‘అగ్నిరితి భస్మ జలమితి భస్మ’ మొదలైన మంత్రాలు చెప్పబడ్డాయి.
”జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం
తమాహు: పండితం బుధా:” అని ‘గీత’లో శ్రీకృష్ణ పరమాత్మ వచనం, జ్ఞానాగ్నిలో కర్మ సంచయం దగ్ధమవడం అనే సంకేతమే భస్మధారణలో ఉంది. ‘అగ్నిసారం భస్మం’ అని శాస్త్రోక్తి. శివుడు మహాగ్ని. పరంజ్యోతి. సాకారంగా జ్ఞానమూర్తి. ఆజ్ఞాన, యోగ లక్షణాలను తెలియజేసేది భస్మధారణ. అందుకే శివు డు భస్మాన్ని ధరిస్తాడు. భస్మానికి ‘విభూతి’ అని కూ డా పేరుంది. విభూది- అంటే ఐశ్వర్యం. అగ్ని కూ డా ఐశ్వర్యకారకుడు. అందుకే అగ్నిసారమైన భస్మం వర్చస్సునీ, ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తుంది.
విభూదిలో మంత్రశక్తిని నిక్షిప్తం చేయవచ్చు. అం దుకే విభూది ద్వారా రక్షణని కల్పించుతారు. దుష్ట శక్తుల దృష్టి పడకుండా విభూది రక్షిస్తుంది. ఇది హిందూమత చిహ్నం. విభూదితో పాటు చందనం, కుంకుమ ధరించడం మన సంప్రదాయం.
మన శరీరంలోని యోగ కేంద్రాలలో లలాటం (నుదురు), భ్రూమధ్యం (కనుబొమల నడుమ) చా లా ప్రధానమైనవి. దేవతా శక్తులను ధ్యానించడానికి, కేంద్రీకరణకి ప్రధాన కేంద్రాలవి. అందుకే వాటికి భస్మధారణ. అగ్నిసారమైన భస్మం వల్ల శరీరం శుద్ధమవు తుంది. ఇది ఏదో ఒక శాఖకి చెందినది కాదు. మన భారతీయ సనాతన ధర్మం. శివుడు, కేశవుడు ఇద్ద రూ మనవారే.”

Advertisement

తాజా వార్తలు

Advertisement