పద్యం: అడిగినయట్టి యాచకుల ఆశలెరుంగక లోభవర్తియై
కడిపిన, ధర్మదేవత ఒకానొకయప్పుడు ఈదు వాని కె
య్యెడల, అదెట్లు? పాలు తమకిచ్చునె ఎచ్చటనైన లేగలన్
కుడువగనీనిచో కెరలి, గోవులు తన్నునుగాక భాస్కరా!
భావం: సంపదగలిగిన ధనికులు యాచించిన వారి కోర్కెలు తెలియ క లోభియై ప్రవర్తించినచో ధర్మ దేవత అతనికి ఐశ్వర్యాన్ని ఇవ్వదు. అదెట్లనగా పాడి ఆవు పాలు పితకడానికి ముందు దాని లేగ దూడకు చేపకపోతే యజమానిని ఆవు వెనక కాళ్లతో తన్నినట్లు. ఇక్కడ భిక్షార్థు లకు తృణమో, ఫలమో సంపద గలవా రు ఇవ్వాలని కవి స్పష్టం చేస్తున్నాడు. లేకపోతే ధర్మదేవత సంపదలివ్వదు.