Friday, October 25, 2024

భక్తి యోగము

మనం పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నాం. పుణ్య నదులలో స్నా నాలు చేస్తున్నాం. వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగా లు, హోమాలు అన్నీ చేస్తాం. అదే భక్తి అనుకుంటాం. మేం ప్రతీ సంవత్సరం తిరుపతి వెళ్తామండి. మా యింట్లో పూజ చేయ కుండా, దీపారాధన చేయకుండా పచ్చిగంగ కూడా ముట్టమం డీ! అని బీరాలు పలికి, అక్కడికి మన మేదో మహాభక్తులమై పోయి నట్లు బోలెడు ఫీల యి పోతాం. కానీ ఆచరణలో మాత్రం హిరణ్య కశిపుడి కన్నా ఎక్కువ అహంకారం, ఆర్భాటం అట్ట హాసం ప్రదర్శి స్తాం. అంతకన్నా ఆత్మవంచన ఇంకేం ఉంటుంది. భక్తి అంటే కేవ లం పదిసార్లు భగవన్నామస్మరణ చేయడం, పూసలు తిప్పడం, అందరికీ కనబడేలా రుద్రాక్ష దండలు వేసుకోవడం, ఆడంబరం గా మాట్లాడడం కాదు. భక్తి వేరు, జ్ఞానం వేరు, కర్మ వేరు కాదు. హిర ణ్యకశిపుడితో ప్రహ్లాదుడు ఏమంటాడో చూడండి.
లోకములన్నియున్‌ గడియలోన జయించినవాడ వింద్రియ
లోకము జిత్తముంగెలువనేరవు నిన్ను నిబద్ధుజేయు నీ
భీకర శత్రులారుర బ్రభిన్నుల జేసిన ప్రాణికోటిలో
నీకు విరోధి లేడొకడు నేర్పున జూచుము దానవేశ్వరా!
అంటే లోకాలన్నింటినీ గడియలోనే జయించావు. కానీ నీ చిత్తంలో తిష్ఠవేసుకున్న ఇంద్రియాలను మాత్రం జయించలేక పోయావు. నిన్ను బంధించి నీమీద పెత్తనం చేస్తున్న ఆరుగురు శత్రువులను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) జయిస్తే నీకీ ప్రపంచంలో విరోధులే ఉండరు. తెలివిగా నడుచుకో వయ్యా దానవేశ్వరా! అని తండ్రిని నిమిత్తమాత్రంగా జేసుకొని మనందరినీ హెచ్చరిస్తున్నాడు ప్రహ్లాదుడు.
మిగిలిన వేదాంతమంతా ప్రక్కన పెట్టినా ఈ ఒక్క పద్యం లోని అర్థాన్ని మనం అంటే మన పాలకులు, అధికార గణం, ప్రజ లు ఆదరించగలిగితే ఈ జాతి పూర్వ వైభవాన్ని పొందటమే కాదు, ప్రపంచానికే ఆదర్శవంతం కాగలుగుతుంది. ఇంతకు మనం ‘నేను భక్తుడ’ను అనుకోవడం కాదు. భగవంతుడు ‘వీడు నా భక్తు డు’ అనుకోవాలి. అంతేకాక దైవాన్ని సర్వంలోనూ, సర్వాన్ని దైవంలోనూ చూడగలిగిన ప్పుడే నిజమైన భక్తుడు కాగలడు. అది భక్తి యోగంలో చరమ దశ అనేది శ్రీ అరవిందుల దివ్య సందేశం.
భక్తి యోగం దృష్టిలో పరమ పురుషుడు ఈ ప్రపంచాన్ని అనుభవించే భోక్త. అతడే దివ్య ప్రియు డు. ఈ విశ్వము ఆ ప్రభువు యొక్క క్రీడ. ఈ విశ్వంలో కడపటి రంగం మానవ జీవితం. మానవ హృద యంలో కలిగే భావావేశాలు, తదితర స్పందనలు, వృత్తులు మానవ సంబంధాల వైపు, ప్రపంచంవైపు మరలనీయ కుండా అన్నింటినీ ఆ పరమ ప్రభువు యందే కేంద్రీకరించాలి అం టుంది. ప్రార్థన, భజన, కీర్తన, నమస్కారం, నివేదన, పూజలు, యాత్రలు, సద్గోష్టి వగైరాల ద్వారా ఈ భక్తిని పెంపొందించుకుం టారు. ఇందులో శాంత భక్తి, దాస్య భక్తి, సఖ్య భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి- ఇలా అనేక రకాల భక్తి ఉంది.
కామోత్కంఠత గోపికల్‌, భయమునన్‌ కంసుండు, వైరి క్రియా
సామగ్రిన్‌ శిశుపాల ముఖ్య దనుజుల్‌, సంబంధులై వృష్ఠులున్‌
ప్రేమన్‌ మీరలు, భక్తి నేమునిట చక్రింగంటి మిట్టైనను
ద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరి జెందవచ్చు ధాత్రీశ్వరా!
అని నారదుడు భాగవతంలో అంటాడు. భక్తిలో అనేక రకా లు. అందులో వైరం కూడా ఒక భక్తే. అలాగే దైవాన్ని చేరుకునేం దుకు అనేక మార్గాలు, భక్తి ద్వారా భక్తుడు ఆనంద పరవశుడై దైవంతో ఏకమైపోతాడు. అంతటితో ఆగిపోనవసరం లేదు. ని న్ను ప్రకృతి (మన: ప్రాణ దేహాలు)లోనికి మోక్ష స్థితిలోని సచ్చి దానందాలు దిగివచ్చి దానిని రూపాంతరం చెం దించి మానవుని దివ్య మానవుడిగా, మానవ జాతిని దివ్య మానవ సమాజంగా చేసే అవకాశం ఉంది అంటారు శ్రీ అరవిందులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement