Tuesday, November 26, 2024

భక్తి ఉద్యమం… వార్కరీ ఉత్సవం

ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి)కి పండరీపుర క్షేత్రంలో వార్కరీ ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. తెలంగాణలో బోనాల పండుగ, ఒడి షాలో పూరీ జగన్నాథుని రథయాత్ర లాంటిదే ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి రోజున పండరిపుర క్షేత్రంలో నిర్వహంచే ‘వార్కరీ’ వేడుక. ఇరవైఒక్క రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రనే మరాఠీలు ‘వార్కరీ’ అని పిలుస్తారు.
వారీ అంటే యాత్ర. కారీ అంటే యాత్రికులు. కాలి నడకన ప్రయాణిస్తూ భక్తి పరమార్థాన్ని పదిమందికీ పంచడమే ‘వార్కరీ’ వేడుక.
మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో భీమానది ఒడ్డున వెలిసిన ప్రసిద్ధ యాత్రాస్థలం పండరీపురం. పండరీపురంలోని విఠల దేవాలయం ప్రధాన దేవాలయం. విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండలీకుడి చుట్టూ తిరుగుతాయి. స్కాంద పురాణం లో పుండలీకుడి ప్రస్తావన ఉంది.
పుండలీకుడిని, విఠోబాను ప్రధాన దైవంగా ఆరాధించే వార్కరీ సాంప్ర దాయం ప్రారంభించిన చారిత్రక పురుషుడిగా అభివర్ణిస్తారు. ఈ పుండలీకుడే విఠోబాను పండరీ పురమునకు రప్పించాడని భక్తుల విశ్వాసం. కొన్ని కథలు ఆయన భక్త కవులను ఎలా కరుణించాడనే సంఘటనల మీద ఉంటాయి. పండరీపురం విఠలుడి కేంద్ర స్థానం. విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడి అంశగా విఠలుడిని కొలుస్తారు భక్తులు. విఠోబాకే విఠల, విఠ్ఠల, పాండురంగడు, పండరీనాథుడని, హరి, నారాయణుడనీ చాలా పేర్లున్నాయి. మహారాష్ట్రతో పాటు. కర్ణాటక, గోవా, తెలంగాణలకూ విఠలుడు ఆరాధన వ్యాప్తి చెందింది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో విఠలుడి ఆరాధన ఎక్కువ. పాండురంగ స్వామి ఆలయాలూ కనిపి స్తాయి. ఆదిలాబాద్‌ జిల్లా విఠలేశ్వరాలయం సుప్రసిద్ధం. అందుకే విఠల్‌, పండరిలాంటి పేర్లు తెలంగాణ సమాజంలో విస్తారంగా వినిపిస్తాయి.
ప్రస్తుతం పండరీపురంలో కనిపించే విఠల రఖుమాయి దేవాలయ నిర్మా ణానికి చారిత్రక పురుషుడైన పుండరీకుడే ఆద్యుడని ఆధారాలు చెబుతున్నా యి. 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుడు రాసిన పాండురంగాష్టకం స్తోత్రాన్ని బట్టి విఠోబా ఆరాధన అంతకు మునుపే ప్రారంభమైందని భావించ వచ్చు. మరాఠీ, కన్నడ సాహత్యాలలోనూ పుండలీకుడి ప్రస్తావనలున్నాయి. పుండరీకుడు కృష్ణ భక్తుడు. వృద్ధులైన తల్లిదండ్రుల సేవలో తరించాడు. అతడి సేవకు మెచ్చిన కృష్ణుడు, పుండరీకుడి ఇంటికి వెళ్లి ‘ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. పుండరీకుడు మాత్రం ‘నేను ఇప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్నా ను. పూర్తయ్యాకే బయటకు వస్తాను. అప్పటిదాకా ఈ ఇటుక మీద నిలబడి వేచి ఉండు’ అంటూ ఒక ఇటుకను బయటికి విసిరాడు. దీంతో, శ్రీకృష్ణుడు రెండు చేతులనూ నడుము మీద పెట్టుకొని, పుండలీకుడు వచ్చేవరకు ఇటుకపైనే నిల బడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వచ్చిన పుండరీకుడు. అలా ఇటుక మీద నిలబడిన రూపంలోనే భక్తులకు దర్శన భాగ్యం కలిగించ మని కృష్ణుడిని కోరుకున్నాడు. దీంతో శ్రీకృష్ణుడే విఠలుడిగా, విఠోబాగా ఆ రూపంలోనే పండరిలో వెలిశాడు. వార్కరీ సాంప్రదాయం ప్రకారం విఠల అనే పదం విఠ్‌ (అంటే ఇటుక), ఠల (స్థలం అనే పదానికి రూపాంతరం, అంటే మీద నిలుచుని ఉన్న) అనే రెండు పదాల కలయిక. విఠోభా అంటే ఇటుకపై నిల్చుని ఉన్నవాడు అని అర్థం వస్తుంది. అంతకుముందు నుంచే అమ్మదేవత గా వెలసిల్లిన రఖుమాయి, సాంస్కృతిక సమ్మేళనం తర్వాత విఠోబా భార్యగా భక్తులతో పూజలందుకుంటున్నది. అందుకే పండరిలో విఠోబాకు, రఖుమా యికి వేర్వేరు ఆలయాలు ఉన్నాయి. విఠోబాను విష్ణువుగా, కృష్ణుడుగా భావిం చినా ఆయన గోపికలతో సాగించిన రాసలీలలులాంటి ఘట్టాలేవీ విఠోబాకు ఆపాదించలేదు. విఠోబాను తన భక్తులు ఎలాంటివారినైనా కరుణించగల దయా సముద్రుడిగా, ఒక తల్లిలాగా బిడ్డలను ప్రేమిస్తాడని వర్ణించారు. పండరీపుర ఆలయంలోని అతి ప్రాచీనమైన భాగం సా.శ. 12, 13వ శతాబ్దాల కు చెందిన యాదవరాజుల కాలానికి చెందినది. ఆలయం విస్తరించడం చాలా కాలం కొనసాగినప్పటికీ చాలా భాగం 17వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తు న్నారు. పరిసరాల్లో దొరికిన ఒక శాసనంలో 1189 సంవత్సరంలో విఠోబా కోసం చిన్న గుడి కట్టినట్లు లిఖించబడి ఉంది. ఆలయ పైభాగంలోని రాతిస్తం భం పైన 1237 లో ఒక శాసనాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం హూయసల రాజైన సోమేశ్వరుడు విఠలుడి నైవేద్య నివేదన ఖర్చుల కోసం ఒక గ్రామాన్ని దానం చేసి ఉన్నాడు. 1249లో రాగిరేకు మీద లభ్యమైన శాసనం ప్రకారం క్రిష్ణుడు అనే యాదవరాజు భీమారధి నది ఒడ్డున ఉన్న పౌండ్రక క్షేత్రాన్ని మహావిష్ణువు సమక్షంలో తన సేనానాయకులలో ఒకడికి దానమిచ్చినట్టుగా ఉంది. ముఖ్యంగా యాదవరాజు రామచంద్రుడి మంత్రి హమాద్రి ఆలయా నికి కానుకలు సమర్పించినట్లు లిఖించబడి ఉంది.
ఇక్కడ రెండు రకాల ఆరాధనా పద్ధతులు కనిపిస్తాయి. ఒకటి మందిరం లోపల నిర్వహంచే బ్రాహ్మణీయ పూజలు, మరొకటి గ్రామీణ ప్రజానీకం భక్తి భావనతో చేసుకునే సాంప్రదాయ ఆరాధన. ఒకటి బద్వ కుటుంబానికి చెందిన బ్రాహ్మణులు ఆలయంలో చేసే వైదిక పూజలు, రెండోది వార్కరీలు ఆచారిస్తున్న ఆధ్యాత్మిక పూజా విధానం ఇందులో రెండోది. శూద్ర కులాల నుంచి ఉద్భ వించి, సంత్‌ల ద్వారా స్థిరపడ్డ వార్కరీ సంప్రదాయం. మహారాష్ట్రలో కుల వివక్షకు వ్యతిరేకంగా మొదలైన భక్తి ఉద్యమం. వార్కరీ యాత్రలతో మిగుల ప్రచారం పొందింది. జ్ఞానేశ్వర్‌ పాదుకలను, తుకారం పాదుకలను పల్లకీల్లో తీసుకెళ్ళడం సనాతనంగా అనుసరిస్తున్న సంప్రదాయ ఆచారం.
ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి దినానికి పండరీపుర క్షేత్రంలో ”వారి” ఉత్స వం జరుగుతుంది. ప్రయాణం చేస్తూ పరమార్థాన్ని పదిమందికీ పంచడమే వార్కరీ సంప్రదాయం. క్రీ.శ 13వ శతాబ్దానికి చెందిన జ్ఞానేశ్వర్‌ మహారాజ్‌ సమాధి క్షేత్రం అళంది నుంచి, క్రీ.శ. 17వ శతానికి చెందిన భక్త తుకారాం సమాధి ఉన్న దేహు నుంచి పాదయాత్రలు ప్రారంభమవుతాయి. అళంది, దేహు క్షేత్రాల నుంచి 250 కిలోమీటర్ల దూరం భక్తులు పాదయాత్రగా వస్తారు. ఇందులో భాగంగా అళంది నుంచి జ్ఞానేశ్వర్‌ పాదుకలను, దేహు నుంచి తుకారం పాదు కలను పల్లకీల్లో తీసుకెళతారు. 21 రోజులపాటు జరిగే ఈ పాద యాత్రలు సరిగ్గా తొలిఏకాదశి ముందు రోజు పండరీపురం చేరుకుంటాయి. భక్తులు ఎంతో దీక్షతో, క్రమశిక్షణతో సాగించే భక్తియాత్ర ఇది. ఇందులో పాల్గొ నే భక్తు లు కఠోర నియమాలు పాటిస్తారు. మద్యమాంసాలు, ఉల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. పాదరక్షలు లేకుండా నడు స్తారు. మెడలో తులసిమాల ధరిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి భక్తుణ్ణి పాండురంగడిగా భావించి ఆదరిస్తారు. కులం, ప్రాంతంతో సంబంధం లేకుం డా సమూహాలుగా భజనలు, పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతారు. ఈ వార్కరీ ఉద్యమం మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపి స్తుంది. తెలంగాణలోని ఆదిలాబా ద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాం తాల్లోను యాత్ర జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement