Monday, November 25, 2024

భక్తి… విధినే మార్చగల శక్తి!

పరమేశ్వరునకు అంకితమైన భక్తులు కూడా అంతటి శక్తిని కలిగి ఉంటారని మన పురా ణాలలో అనేక గాథలు కలవు. వాటిలో స్కాంద పురాణాంతర్గతమైన ఒక విచిత్రమై న గాథను తెలుసుకుందాము.
పూర్వము విదర్భ దేశంలో వేదశాస్త్రాలు తెలిసినవాడు, బుద్ధిమంతుడు అయిన వేద మిత్రుడనే బ్రాహ్మణోత్తముడున్నాడు. అతనికి సారస్వతుడు అను బ్రాహ్మణ మిత్రుడున్నా డు. వారి స్నేహం ఎంతో విలువలతో కూడి ఉండేది. వారికి లేకలేక ఇద్దరు కొడుకులు కలిగా రు. వేదమిత్రుడి కొడుకు సుమేధుడు, సారస్వతుని కొడుకు సామవంతుడు. తండ్రుల లాగా నే వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. వారి రూపురేఖలు ఎంతో అందంగా ఉండేవి. వారు చతుర్వేద పారంగతులై సమాజంలో ఎంతో తెలివైనవారుగా పేరు తెచ్చుకొన్నారు. యుక్తవయసు వచ్చిన పిదప వారి తల్లితండ్రులు వారిని విదర్భ దేశ రాజు వద్దకు వెళ్ళమని, వారి పాండిత్యంతో రాజును మెప్పించి ధనం సంపాదించి వివాహాలు చేసుకొమ్మని పంపిం చారు. వారు తల్లితండ్రులు చెప్పిన విధంగా రాజు వద్దకు వెళ్ళి పాండిత్య ప్రదర్శన చేసి వివాహానికి ధనం అడిగారు. అంత ఆ రాజు లౌకిక వ్యవహారానికి ధనం అడిగిన వారిని చూచి విధివశాత్తు తోచిన ఆలోచనతో, సమీప రాజు అయిన నిషధ దేశ రాజు చంద్రాంగదుని భార్య సీమంతిని సతి సోమవార వ్రతముతో పార్వతీ పరమేశ్వరులను పూజించి బ్రాహ్మణ దంప తులకు అపారమైన ధనమును ఇచ్చుచున్నది అని చెప్పి అక్కడికి మీలో ఒకరు స్త్రీ వేషం వేసు కొని దంపతులుగా వెళ్ళమన్నాడు.

దేవతాసు గురౌ పిత్రోస్తధా రాజకు లేఘచ
కౌటిల్య మాచర న్మౌహాత్సద్యోనశ్యతి సాన్వయ:

దేవతలకు, గురువులకు, తల్లితండ్రులకు, రాజునకు తప్పు చేసినవాడు వెంటనే వం శంతో సహా నశిస్తాడు. వేదవేదంగాలు నేర్చిన మేము కపటం చేయజాలము. కపటం చేత పాపం, నింద, భయం, ద్వేషం లభిస్తాయి. కావున గుణవంతుల కుటుంబంలో పుట్టిన మే ము అటుల చేయమని చెప్పారు. అంతట రాజు మీరు చెప్పినవారు ఎవరైనా సరే రాజు శాస నాన్ని అతిక్రమించకూడదు. పరిపాలకుడు ఆజ్ఞాపిస్తే తప్పనిసరిగా చేయాలి. కాబట్టి నేను చెప్పింది చేయండి అని గట్టిగా చెప్పాడు.
ఇక తప్పని పరిస్థితిలో వారిరువురు ఒప్పుకున్నారు. అప్పుడు రాజు సామవంతుడిని స్త్రీగా వేషధారణ చేయించాడు. చిత్రం, అసలే అందగాడైన సామవంతుడు స్త్రీ వేషధారణ లో మరింత సౌందర్యంతో వెలిగిపోయాడు. అసలు పురుషుడంటే నమ్మే పరిస్ధితి లేదు.
సుమేధుడు స్త్రీగా వేషము మార్చిన సామవంతుని తీసుకొని దంపతులుగా నిషిధ దేశానికి వెళ్ళారు. సోమవారం నాడు మిగిలిన బ్రాహ్మణ దంపతులతో కలిసి రాజపత్ని సీమంతిని ఆతిథ్యం స్వీకరించారు. ఆమె వారిని సకల లాంఛనాలతో పూజించింది. పరమే శ్వర భక్తురాలైన ఆమె సుమేధుని, సామవంతుని చూచి విషయం గ్రహించింది. తనలో తాను నవ్వుకొని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగానున్న వారిని చూచి వారిలోకి ఆ కైలాస వాసులైన ఆది దంపతులను ఆవాహన చేసింది. బంగారు పాత్రలలో వారికి షడ్రసోపేతమై న నైవేద్యాలను అర్పించింది. దక్షిణ తాంబూలాలుగ అనేక గోవులు, పట్టు వస్త్రాలు, బంగా రు నాణాలు, రత్నాలు, అలంకారాలు ఇచ్చి వారిని సేవకులతో పాటు వీడ్కోలు చెప్పి పంపిం చింది. పరమ భక్తురాలైన సీమంతిని సామవంతుని యందు పార్వతిని ఆవాహనం చేయ డం వల్ల నిజంగానే పుణ్యస్త్రీగా మారిపోయాడు. భక్తి ప్రభావం వలన సంకల్ప సిద్ధి కలిగింది.
మార్గ మధ్యంలో స్త్రీగా ప్రవర్తిస్తున్న సామవంతుని, సుమేధుడు ఇక నాటకం చాలని వారించాడు. అంత ఆమె ఓ సుందరుడా! నాథా! నాటకం ఏమిటి? విచిత్రంగా మాట్లాడుచు న్నావు? ఇక్కడ ఈ పూలవనాలు నిన్ను మన్మథాక్రాంతుని చేయుట లేదా? నా సౌందర్యం, నా ¸°వ్వనం నిన్ను మరపించుట లేదా? ఎందుకిక ఆలస్యం రా! అని కౌగిలించుకొంది. ఆశ్చర్యపోయిన సుమేధుడు నిజంగా స్త్రీగా మారిన మిత్రుణ్ణి చూసి ఒకింత ఆశ్చర్యం, భయంతో విలవిలలాడిపోయాడు. నీ అనుమానం తీరింది కదా! నేను సామవతిని నీ అర్థాం గిని అంటూ మరొకసారి కౌగిలించుకొంది. ఈసారి సుమేధునికి నిజంగానే స్త్రీ స్పర్శ తగిలిం ది. మరింత భయపడిన సుమేధుడు ఆమెను వారించాడు. ఇలా వారిరువురు తిరిగి ఇంటికి చేరారు. తల్లితండ్రులకు జరిగినదంతా వివరించారు. వారు ఎంతో ఆశ్చర్యానికి, బాధకు గురయ్యారు. పుత్ర సంతానం పోయినదని సారస్వతుడు వేదనకు గురయ్యాడు. అందరూ కలసి విదర్భ రాజు దగ్గరకు వెళ్ళారు. రాజాజ్ఞకు బద్ధులై వెళ్ళిన వారి దుస్థితిని గురించి ప్రశ్నించారు. నాకు కొడుకును లేకుండా చేసిన నువ్వు న్యాయం చెయ్యాలని కోరాడు సారస్వ తుడు. రాజు కూడా సీమంతిని యొక్క పరమేశ్వర భక్తికి ఆశ్చర్యపోయాడు. స్త్రీగా మారిన బ్రాహ్మణ యువకుణ్ణి చూసి సభలో అందరూ విస్తుపోయారు. పార్వతీ పరమేశ్వరులు భక్తు ల సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమైనా చేస్తారని తలచారు. ఏమీ చేయలేకపోయిన విదర్భ రాజు చివరకు మునిశ్రేష్ఠుడైన భరద్వాజుని పిలిపించాడు. మునికి రాజలాంఛనాలతో పూజ చేసి తాను చేసిన పనికి ఆ బ్రాహ్మణ కుటుంబాలు ఇబ్బందులు పాలయ్యారని, కనుక తరుణో పాయం చెప్పమని ప్రార్థించాడు.
ఇది పార్వతీ పరమేశ్వరుల లీల కనుక తిరిగి వారే పరిష్కరించాలి. అంబికాదేవిని ఉపా సించిన వారికి భయముండదు. మూడురోజులు ఉపవసించి పార్వతీదేవిని జప హోమ పూ జలతో అర్చించాలి. నీవు చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలి. అప్పుడే ఈ సమస్య నుండి బయటపడగలవని భరద్వాజ ముని చెప్పగా రాజు అట్లే మూడు రోజులు హోమము చేసి పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకొన్నాడు.
పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై సీమంతిని భక్తిప్రపత్తుల వలన ఈ విధివిలాసం జరి గింది. కావున సుమేధునకు సామవతినిచ్చి వివాహం జరిపించమని, సారస్వతునకు ఒక కుమారుడు కలుగునని వరమిచ్చి అంతర్థానమయ్యారు.
ఆ ఇరు బ్రాహ్మణ కుటుంబాలు ఆదిదంపతుల ఆజ్ఞను శిరసావహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement