Saturday, November 23, 2024

సందేహ నివృత్తి

అభిమన్యుని మనుమడైన జనమేజయుడు సర్పయాగము ముగించిన పిమ్మట వ్యాస భగవానుని శిష్యుడైన వైశంపాయన మహామునిని తన పూర్వీకుల గురించి కొన్ని సంశ యములు తీర్చమని కోరాడు. మహావిష్ణువు ఏ కారణంబున మానవుడై పుట్టి శ్రీకృష్ణ నామ ము ధరించి తన లీలలను ప్రదర్శించినాడు? ద్రుపద మహారాజు పుత్రికయైన ద్రౌపదికి ఐదు గురు భర్తలు కలుగుటకు కారణమేమి? బలరాముడు కౌరవుల పక్షాన, పాండవుల వైపు గాని యుద్ధమునందు పాల్గొనక తీర్థయాత్రలు జేయుటకు వెళ్ళుటకు కారణమేమి? ఉపపాండవులైన ద్రౌపదీ పుత్రులు ఐదుగురు ప్రసిద్ధ వంశమున జన్మించి వివాహాది సంస్కార ములు లేక దిక్కులేనివారిగా మృతిచెందుటకు కారణమేమి? అని అడిగాడు. అంత ఆయన జైమినిని వింధ్యపర్వత గుహలలోనున్న పింగాక్షము, నిబోధము, సుపత్రము, సుముఖము లను నాలుగు జ్ఞానపక్షులున్నాయి. అవి నీ సందేహాలను తీర్చగలవని అక్కడికి వెళ్ళవలసిన దని సూచించి తాను తపస్సుకు ఉపక్రమించినాడు. మార్కండేయుని సూచన ప్రకారము వింధ్యపర్వతములోని గుహకు చేరుకొని సందేహాలను తీర్చుకున్నాడు.
ద్వాపరయుగాంతంలో శ్రీమహావిష్ణువు యాదవవంశంలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. ఇక నీ రెండవ సందేహమునకు నివృత్తి, పూర్వము త్వష్ట ప్రజాపతి పుత్రుడు త్రిశిరుడు మాయావియై తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు తన తేజమునకు భంగమని తలచి తన వజ్రాయుధముతో అతని శిరస్సు ఖండించాడు. అది ఇంద్రునకు బ్రహ్మ హత్యాపాతకముగా మారింది. అతని తేజము నాలుగు భాగాలుగా విడిపోయి ఒక భాగము ధర్మముగా, రెండ వభాగము వాయువుగా, మూడు, నాలుగు భాగములు అశ్వనీదేవతలయందు ప్రవేశించెను. ఆ తేజములే భూలోకమున కుంతీ గర్భమునందు ధర్మరాజు, భీమ, నకుల సహదేవులుగా జన్మించినారు. ఇక ఐదవ అంశగా ఇంద్రుడు అర్జునినిగా పుట్టినాడు. శచీదేవి ద్రుపద మహా రాజుచే చేయబడిన యాగమునందు హోమగుండములో ద్రౌపదిగా ఉద్భవించినది. అందు వలననే ఆమెకు ఇంద్రాంశలైన ఐదుగురు భర్తలుగా కల్గిరి. బలరాముడు శ్రీకృష్ణునకు అన్న గారు. దుర్యోధనుడు బలరాముని ప్రియశిష్యుడు.


ఇక ఉపపాండవుల గురించి, త్రేతాయుగమున హరిశ్చంద్రుడను రాజు పరిపాలన చేయు చుండగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రునిచే అసత్యమును పలికించెదనని ప్రతిజ్ఞచేసాడు. యాగ దక్షిణను తీసుకొని తిరిగి దానిని అతని వద్దనే ఉంచమని కోరి తపస్సుకు వెడతాడు. కొంత కాలానికి తిరిగివచ్చి అతని రాజ్యమును సత్యబద్ధుడైన హరిశ్చంద్రుని నుండి గ్రహించాడు. తిరిగి అతని వద్ద దాచిన యాగదక్షిణ ఇవ్వమని వత్తిడి తెచ్చాడు. ధనహీనుడైన హరిశ్చంద్రు డు గడువుకోరగా తన శిష్యుడైన నక్షత్రకునికి ఆసొమ్ము ఇవ్వమని అతని కూడా పంపాడు. చివరకు అసత్యము ఆడని హరిశ్చంద్రుడు అనేక ఇక్కట్లు పడి తన భార్యాపుత్రులను అమ్మి వేసినాడు. ఆ సొమ్మును విశ్వామిత్రునకు శిష్యుని ద్వారా పంపగా అది సరిపోదని ఇంకా ఇవ్వమని బాధించసాగాడు. అది చూసి విశ్వదేవతలు ఐదుగురు విశ్వామిత్రునకు ధర్మము చెప్పుటకు అక్కడికి వచ్చారు. నేను కోరకుండగా మీరు ధర్మము చెప్పుటకు వచ్చారు కావున మీరు భూలోకమున మానవులై పుట్టమని శపించాడు విశ్వామిత్రుడు. అంతవారు శాపవిమో చనము కోరగా వారిని పాండవ వంశమున ద్రౌపది గర్భమున జన్మించి ఎటువంటి సంస్కా రములులేక యుద్ధంలో మృతిచెంది దేవలోకానికివెళతారు. వారే ఉపపాండవులు. ఈవిధం గా ఆ జ్ఞాన పక్షులు జైమిని సందేహములు తీర్చినవి. నీవుకూడా సందేహాల నుండి నివృ త్తి పొందావని ఆశిస్తున్నానని మార్కండేయముని చెప్పగా జనమేజయుడ అభివాదంచేశాడు.
– వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు, 8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement