Tuesday, November 19, 2024

స్త్రీ ఔన్నత్యం

నేటి సమాజంలో కొందరు స్త్రీలు తాము కోరినవి భర్త తేలేని స్థితిలో ఉన్నప్పు డు, అందరి ముందూ తూలనాడుతూ, అవహేళన చేస్తూ, అవమానకరంగా ప్రవర్తిస్తుంటా రు. భర్తపై హాస్య ధోరణిలో మాట్లాడతారు. పెళ్ళైన స్త్రీమూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో చాటి చెప్పే గొప్ప శ్లోకం రామాయణంలో ఉం ది. పతివ్రతా ధర్మాన్ని ఆచరించి చూపిన మ హా పతివ్రత సీతమ్మ రావణునిచే అపహరిం పబడి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీల తో జరిగిన సంభాషణ అత్యంత రమణీయం.
వాల్మీకి మహర్షి విరచిత రామాయణం లో ‘సుందర కాండము’ అత్యంత ప్రశస్తము. అందు లో ఈ శ్లోకం అత్యద్భుతంగా ఉంటుం ది. ఆదికవి వాల్మీకి అని ఎందుకు అంటారో రామాయణం అంత అద్భుతంగా తాను తన దివ్య దృష్టితో కన్న దంతా పొల్లు పోకుండా విడమరచి వ్రాయడం సామాన్యులకు సాధ్యమే నా.
లంకా రాజ్యములో రావణుని అశోక వన ములో శింశుపా వృక్షము కింద సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు ఆమెను పలుపలు విధా లా దూషించారు. రావణుని వరించి సుఖించ మని లేకున్న చంపి తినివేస్తామని బెదిరించా రు. రావణుడు కూడా ఎన్నో ఆశలు చూపెట్టా డు. అయినా మహాపతివ్రత సీతా సాధ్వి కొం చెం కూడా చలించలేదు. ఆమె సుగుణాలుగ న్న రాక్షస స్త్రీ గణం మారారు గానీ, సీత ఆ లం కా సామ్రాజ్య వైభవం అంతా గడ్డిపోచతో సమానంగా భావించింది. సీత సుగుణాలకు ముచ్చట పడిన రాక్షస కాంతలు- ”రాజ్యము, వైభవం ఏమాత్రం లేని రాముడినే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు. ఆయన్ని తిరిగి చేరినా నీకు కష్టాలు తప్ప మరేముంటుంది” అని అడిగారు.
దానికి సీతా మహా సాధ్వి ఇచ్చిన సమా ధానం ఈ అద్భుత శ్లోకం-
దీనోవా రాజ్య హనోవా యో మే భర్తా సమే గురు:
తం నిత్యా మనురక్తా స్మి యథా
సూర్యం సువర్చలా
యథా శచీ మహా భాగా శక్రం సముపతిష్టతి
అరుంధతీ వశిష్టంచ రో#హణీ శశినం యథా
లోపాముద్ర యగస్త్యం సుకన్యా చ్యవనం యథా
సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతీ యథా
సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా
తథా#హు మిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా
తన పతి అయిన రామునికి రాజ్యము లేకపోయినా అతను దీనస్థితిలో ఉన్నా ఆయ న యెడల నిత్యం అనురక్తితో ఉంటానని సీతా దేవి ఇలా చెప్పింది. సూర్య భగవా నుని సువ ర్చలాదేవి, ఇంద్రుని మహాపతివ్రత శచీదేవి, క్షత్రియ వంశ గురువు వశిష్టులవారిని అరుం ధతి, చంద్రుని వరించి అతనితోనే అనురక్తురా లైన రోహణీ తార వలె, అగస్త్య మహామునిని సేవించిన లోపాముద్ర మాదిరి, చ్యవనుని సేవించిన సుకన్యవోలె, సత్యవంతుని బ్రతికిం చుకున్న సావిత్రి వలె, కపిల మహా మునిని సేవించిన శ్రీమతి వలె, సౌదాసుని అనుస రించిన మదయంతి వోలె, సగర చక్రవర్తిని అనుసరించిన కేశిని వలె, నలమహారాజుని వ రించిన భీమ రాజ పుత్రి దమయంతీదేవి వలె ఇక్ష్వాకు వంశ తిలకుడు తన పతి శ్రీరాముని అ న్నివేళలా అనుసరిస్తానని సీతాదేవి చెప్పింది.
అదివిన్న ఆ రాక్షస స్త్రీలు అందరూ సీత శీ ల సౌభాగ్యానికి అమిత ముగ్ధులైపోయి, ఆమె పాదాలను అప్రయత్నంగా తాకారట ఆ రాక్షస స్త్రీలు.ఇదీ మన స్త్రీల ఔన్నత్యం. సౌభాగ్యము.

Advertisement

తాజా వార్తలు

Advertisement