Saturday, November 23, 2024

భక్త సులభుడు అన్నవరం సత్యదేవుడు

”మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతశ్చ మహశ్వరం
అధతో విష్ణురూపాయ, త్త్య్రెక్యరూపాయతేనమ:”

అని శ్రీ సత్యనారాయణస్వామి వారిని స్తుతిస్తారు.
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామి వారి కళ్యాణ మహో త్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళపాడ్యమి వరకు పంచాహ్నకంగా, స్మార్తాగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభ వంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. హరిహరులకు బేధం లేదని నిరూపిస్తూ ఇక్కడ సత్యన్నారాయణ స్వామి పక్కనే శివుడు కూడా పూజలందుకుంటాడు. ఈ క్షేత్రపాలకులైన సీతారాములకు కూడా శ్రీరామనవమి రోజున కళ్యాణం నిర్వహంచే సంప్రదాయం కొనసాగుతుంది. అన్నవరం దేవాల యం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో, తూర్పుగోదావరి జిల్లా, రత్నగిరికొండ మీద ఉన్న ది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి పేరుంది. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ. ఈయనను కోరిన వెంటనే కోరికలు తీరుస్తాడని అందరూ నమ్ముతారు.
ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం) వరాలను తీర్చే దేవుడు కాబట్టి (అని నంవరం –అన్నవరం) ”అన్నవరం దేవుడు” అంటారు. స్థలపురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరుపర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒ కడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి శ్రీరామచంద్రమూర్తికి నివాసస్థానమైన భద్రాచలంగా మారుతాడు. ఆ భద్రాచలం నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఉంది. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.
తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీరాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవా డు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామారాయణిం బహద్దరు వారికీ ఏకకాలంలో కలలో కనపడి ”రాబోవు శ్రావణ శుక్ల విదియ మఖ నక్షత్రములో గురువారమునాడు రత్నగిరిపై వెలయుచున్నాను. నీవు న న్ను శాస్త్ర నియమానుసారము ప్రతిష్టించి సేవించుము” అని చెప్పి మాయమయ్యారు.
మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్స ర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టుకింద పొదలో స్వామి వారి పాదములు కన బడ్డాయి. వెంటనేవారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని వెళ్లారు. అటుపై కాశీనుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠ నారా యణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఇక ఆలయాన్ని క్రీస్తుశకం 1934లో నిర్మించారు. రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపు రం, వెనుకగా ఆది త్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్నవి. ఒకేచోట ఇన్ని రకాలైన దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. ఇక పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడి కి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథా కారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయా నికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వన దుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్నిపు రాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉం టుంది. ఈ ఆలయం రెండు అంతస్తు లలో నిర్మింపబడింది.
క్రింది భాగంలో యంత్రం, పైఅంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తా రు, మధ్యభాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్ర హంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడి విశేషం. త్రిపాదవిభూతి నారా యణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది.

కాల నిర్ణయ గడియారం

కాల నిర్ణయ గడియారం పిడపరి ్త కృష్ణమూర్తిశాస్త్రి నిర్మించిన కాలనిర్ణయ నిర్దేశక యంత్రం రత్నగిరిపైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉంది. సూర్యుని నీడ (ఎండ) ఆధా రంగా కాలనిర్ణయం చేసి, పనిచేసే గడియారం ఇది. దీనిపక్కనే తులసివనం ఉంది.
అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యన్నారాయణస్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యనివారు అరుదేమో. మరి సాక్షాత్తూ ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటం కన్నా భాగ్యమేముంటుంది. ఇక్కడ సామూహకంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పం డుగగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత.
అన్నవరం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఆల యం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. శ్రీ సత్యదేవస్వామి కీర్తి, గొప్పతనాన్ని స్కందపురా ణం రేవాఖాండలో విస్తృతంగా వర్ణించబడింది. శ్రీ సత్యదేవస్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మితో ఒకవైపు, శివుడు మరొక వైపు ఉన్నారు. సత్యదేవస్వామి నిజాయితీకి ప్రతీక అం దువలన స్వామి నిత్యం భక్తులకు దీవెనలను అందిస్తున్నారు కావున ఎలాంటి తారత మ్యం లేకుండా విష్ణుభక్తులు, శివభక్తులు అందరూ వేలాదిమంది యాత్రికులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అన్నవరం ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది. స్వచ్చమైన నెయ్యి, ఎర్ర గోధుమలతో తయారుచేసే ప్రసాదాన్ని ఒక్కసారి తిన్నవాళ్ళు ఎప్పటికీ ఆ రుచిని మరచిపోలేరు. రత్నగిరిపై ఎప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణమే. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ని ర్వ#హంచే స్వామివారి కల్యాణోత్సవం చూసి తరించాల్సి ందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement