ప్రస్తుతం మనం దేవీ నవరాత్రులు జరుపుకొంటున్నాము. ఈ నవరాత్రులులో దుర్గా, మహాలక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, బాలాత్రిపుర సుందరి, లలితాదేవి, ఇలా ఎన్నో రూపాల్లో ఆరాధిస్తున్నాం. ఈ అన్ని రూపాలకు మూలం జగన్మాత. ఆ జగన్మాత చెప్పిన విషయాన్ని, జ్ఞానాన్నే దేవి గీత అంటారు. (దేవి భాగవతం)
హమత్పర్వతరాజు జగన్మాత భక్తుడు. దేవతలు, హమత్పర్వతరాజు, తారకాసుర సంహారం నిమిత్తం, జగన్మాత అనుగ్రహం కోసం శ్రీహరి సూచన మేరకు, తపస్సు, యజ్ఞ యాగాలు చేయడం, ఆమె నామాలు స్థుతించడం వంటి సత్కర్మలు చేయడంతో జగజ్జనని ప్రత్యక్షమై, తాను తన భక్తుడైన హమత్పర్వతరాజు, ఇంట గౌరీదేవిగా అవతరిస్తున్నట్లు తెలపగా, పర్వతరాజు ”తల్లి! జగన్మాత! నాకు కూతురుగా జన్మిస్తున్నావంటే నేను ధన్య జీవిని. నా కీర్తి తిరుగులేనిది. ఏ తల్లి కడుపులో బ్రహ్మాండాలుంటాయో, ఆ తల్లి నాకు కు మార్తె కావడం నా అదృష్టం. తల్లి! నాదొక చిన్న కోరిక. సర్వవేదాంత ప్రతిపాదితమైన నీ రూ పాన్ని, లీలలు తెలుసుకోవాలని ఉంది.
భక్తి సహతమైన జ్ఞానాన్ని అనుగ్రహంచు!” అని కోరగా, జగన్మాత సమ్మతించి, శ్రుతి నిహతమైన రహస్యాన్ని బోధించింది.”ఆది నుంచి నేనున్నాను. ఇది ఆత్మరూపం. దానికి చిత్తు సంవిత్తు, పరబ్రహ్మ, అని పేర్లు. స్వతసిద్ధమైన శక్తి నాది. అదే మాయ. అగ్నికి వేడిలా, సూర్యుడుకు ప్రకాశశక్తిలా, చంద్రుడుకు వెన్నెలలా, నాకు సహజశక్తి. జీవులు, వారి కర్మలు, కాలము అన్నీ అందులోనే సంచరిస్తూ ఉంటాయి. ఆ స్వశక్తి సమా యోగం వల్ల, నేను బీజా త్మాతను పొందుతాను. ఈ మాయా శక్తినే తపస్సు అంటారు. కొందరు తమస్సు అంటారు. మరికొందరు జడం అంటారు. అత్యంత ప్రేమ స్వరూపత్వంవల్ల ఆనంద రూపత్వం వస్తుం ది. తదితరమంతా మిథ్య కనుక అసంగత్వం. కేవలం జ్ఞానమే.
ఆత్మ అనేది జ్ఞానరూపం ఆత్మ ధర్మం కాదు. సుఖరూపం. ఇది సత్యం. సంస్కారమైన కామ్యకర్మలు, కాలవికారాదులు అన్ని నా మాయ వల్ల ఆవిర్భవిస్తూంటాయి. అవివేకం, అవిద్య, అబుద్ధి. మాయవల్లనే వీటి సృజన జరుగుతుంది. పర్వతరాజా! ఇది నా అలౌకిక రూపం. మాయాశంభవితం. అవ్యాకృతం. దీన్నే సర్వకారణంగా, శాస్త్రాలు విశదీకరిస్తు న్నాయి. ఇది ఆదితత్త్వం. సచ్చిదానంద రూపం. సర్వకర్మ ఘనీభూతం. ఇచ్ఛాజ్ఞాన క్రియాశ్రయమూ, హంకార మంత్ర వాచ్యము, అయిన నా ఆదితత్త్వాన్ని నీకు ఉపదేశి ం చాను. దాని నుండే శబ్ధతన్మాత్రక రూపమైన ఆకాశం ఆవిర్భవించింది. ఆ ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుంచి గంథగణికమైన ఈ పృథ్వి ఆవిర్భవించాయి. వీటిలో ఆకాశం శబ్దగుణాత్మకమైతే,, వాయువు శబ్ద- స్వర గుణ కము. అగ్ని శబ్ద- స్పర్శ రూప గుణాన్వితం. జలమేమో శబ్ద- రూప- స్పర్శ- రస గుణా న్వితం. పృథ్వికి శబ్ద- రూప- స్పర్శ- రస- గంథాలు ఐదూ ఉంటాయి. అందుకే దీన్ని పంచ గుణాన్వితం అంటాం. ఈ పంచభూతాలతో ఏర్పడిందే సృష్టి. ఇది సర్వ భూతాత్మకం. దీన్నే మహాత్యూత్రం అని లేదా లింగం అని అంటారు.
ఆత్మకు లింగ శరీరం, కారణం శరీ రం, రెండూ ఉంటాయి. కారణం శరీరం అవ్యక్తం. పంచీకరణ మార్గంలో స్థూల దేహం ఏర్పడుతుంది. పంచభూతాలు తమ గుణాలకు లోబడి, ఇతర గుణాలతో కలవడం వల్ల ఇంద్రియాలు, అంత:కరణ వంటివి ఏర్పడతాయి. ఈ అంత:కరణ వల్ల సంకల్ప- వికల్పాలకు మూలమైన మనసు, సంశయ రహతమైన, నిశ్చయ జ్ఞానాన్ని అందించే బుద్ధి, త్రిగుణాలతో రూపొందించిన కర్మేంద్రియాలు, వీటి సమీకరణ శక్తి పంచప్రాణాలు, తద్వారా శరీరంలో స్థిరపడి, ఐదు పంచేం ద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణ పంచకం, బుద్ధి, మనస్సు, ఇవ న్నీ కలిపి సూక్ష్మ శరీరం. దీనినే లింగ శరీరం అని కూడా పిలుస్తారు.
హమగిరీంద్రా! ఈ చరాచర జగత్తు అంతా నా మాయా శక్తికి ఆధీనమే. వాస్తవంగా మాయ వేరే లేదు. నేనే మాయ. వ్యవహా రంలో మాత్రం మాయ అని, విద్య అని, వేరువేరుగా చెపుతూ ఉం టారు. తత్త్వ దృష్టిలో ఈ బేధం లేదు. ఉన్నది కేవలం నా తత్త్వమే. సర్వజగత్తునూ సృష్టించి, మాయ కర్మాది సహతమై అందులోకి ప్రాణపూర్వకంగా ప్రవేశిస్తాను. లోకాంతర్గతి అంతా నా మాయా ధీనాలే. ఉచ్చనీచాది వస్తువులన్నిం టిపైనా, తనవెలుగుతో సమానం గా ప్రకాశింప చేస్తున్న సూర్యుడుకి ఏ దోషాలు ఎలా అంటవో? అలాగే నాకూ ఏ దోషాలు అంటవు.
రాజా! కొందరు తమ బుద్ధి ననుసరించి చేసే కర్మలను నాకు ఆపాదిస్తారు. అది కేవలం అజ్ఞానం. దీనికి తోడు సృష్టి అంతా నాలో జాతప్రోతంగా ఇమిడి ఉంది. ఈశ్వరత్త్వం నాదే. బ్ర#హ్మ, విష్ణు, మహశ్వరులు, వాణి, శ్రీలక్ష్మీ, పార్వతీలు, సూర్యచంద్రాదితారక లు అన్నీ నా స్వరూపమే. పశుపక్షాలరూపం నేనే. సత్కర్మలు,దుష్క ర్మలు, క్రూర కర్మలు అన్నీ నా స్వరూపాలే. లోపల, బయట అంతా వ్యాపించి ఉన్నది నేనే. చరము కాని, అచరము కాని, నేను లేని వస్తువులు లేవు. ఒకవేళ ఉందీ అంటే కేవలము శూన్యం మాత్రమే. ఒకే రజ్జువు సర్పంలాగ ఎలా భ్రాంతిని కలిగిస్తుందో, అలాగే నేను దశాది రూపాలతో భాసి స్తూంటాను. నా అస్థిత్త్వంతోనే ఈ సృష్టికి కూడా అస్థిత్వం వస్తుంది” అని అమ్మ తన తత్త్వం సంపూర్ణంగా చెప్పింది.
హమవంతుడు ”మహాదేవి! నీవు సమిష్టి రూపానివి. నిన్ను ఏమని స్తుతించ గలం. జగన్మాతా! నమోనమ:.” అని ప్రార్థించాడు.
దేవి మరల గంభీర స్వరంతో ”దేవతలారా! మీమీద వాత్స ల్యంతో నా తత్త్వాన్ని మీకు వివరించాను. ఇది వేదాధ్యయనం వల్ల తెలియదు. నా అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది.” అని చెప్పి అంతర్థా నం అయ్యింది.
ఈ దేవీ నవరాత్రులు సందర్భముగా దేవీగీత చదివినా, విన్నా అమ్మ అనుగ్ర#హం పొందగలరని దేవి భాగవతం చెబుతు న్నది
– అనంతాత్మకుల రంగారావు
7989462679
భగవతి జ్ఞాన బోధ
Advertisement
తాజా వార్తలు
Advertisement