Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 08
08
న హి ప్రపశ్యామి మామపనుద్యాత్‌
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్‌|
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్‌ ||

తాత్పర్యము : ఇంద్రియములను దహింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధపత్యము వలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను.

భాష్యము : అనేక అర్హతలు కలిగి ఉండి శాస్త్రాలను కూడా తెలుసుకున్న అర్జునుడు సైతము గురువును ఆశ్రయించవలసి వచ్చినది. కాబట్టి భౌతిక విద్య, పాండిత్యము, పేరు ప్రతిష్టలు, పదవులు ఇలా ఎన్ని ఉన్నా సరే జీవిత సమస్యలను పరిష్కరించుకోవలెనన్న గురువను ఆశ్రయించుట తప్పనిసరి. అటువంటి గురువుకి ఉండవలసిన ఏకైక అర్హత, కృష్ణతత్వమును పూర్తిగా తెలిసికొనియుండుట, సంపూర్ణ శుద్ధ భక్తుడై ఉండటు. జన్మమృత్యు జరా వ్యాధులను సమస్యలను కేవలము ఆర్థిక పురోగతితో పరిష్కరించలేము. అదే నిజమైనట్లయితే నేడు సంపన్న దేశాలు శాంత కోసము ప్రాకులాడవలసిన అవసరము లేదు. చంద్రమండలమునకు ప్రయాణించవలసిన అవసరమూ లేదు. ఇవన్నీ తాత్కాలిక పరిష్కారాలే కనుక అర్జునుడు ఇక్కడ ఇవి సమాధానాలు కావని, సరైన పరిష్కారాన్ని తెలియజేయమని శ్రీ కృష్ణున్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement