Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 60
60.
స్వభావజేన కౌంతేయ
నిబద్ధ: స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్‌
కరిష్యస్యవశోపి తత్‌ ||

తాత్పర్యము : మోహకారణముగా నీ విప్పుడు నా నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపకున్నావు. కాని ఓ కౌంతేయా! నీ స్వభావము వలన పుట్టిన కర్మచే గత్యంతరము లేక నీవు దానిని ఒనరింపగలవు.

భాష్యము : ఎవరైతే భగవంతుని ఆదేశములను ఉల్లంఘించెదరో వారు త్రిగుణములలో బంధీ అగుదురు. కాబట్టి తమ తమ గుణములను బట్టి ప్రవర్తించవలసి వస్తుంది. అలా ప్రతి ఒక్కరూ గుణములలో బంధీయై వానిననుసరించి కార్యములు చేయుదురు. కానీ ఎవరైతే తానంతట తాను భగవంతుని ఆదేశానుసారము వర్తించెదరో వారు కీర్తించబడెదరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement