అధ్యాయం 18, శ్లోకం 59
59.
యదహంకారమాశ్రిత్య
న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే
ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ||
తాత్పర్యము : ఒకవేళ నా నిర్దేశము ననుసరించి వర్తించక యుద్ధము చేయకుందువేని నీవు తప్పు మార్గము పట్టినవాడు వగుదువు. నీ స్వభావము ననుసరించి నీవు యుద్ధము నందు నియుక్తుడవు కావలసియే యున్నది.
భాష్యము : అర్జునుడు క్షత్రియుడగుటచే యుద్ధము చేయవలసి ఉన్నది. కానీ నా గురువు, తాత గారితో యుద్ధము మంచిది కాదని వాదించుచుండెను. మన మంచి చెడులు మనకంటే భగవంతుడికే ఎక్కువగా తెలియును కాబట్టి ఆయన సూచనలను శిరసా వహించవలెను. దీనిని మరచి మనకే బాగా తెలుసును అని అనుకొనుట బంధనమునకు కారణమగును. కాబట్టి ఎవరూ భగవంతుని, ఆయన ప్రతినిధియైన గురువు యొక్క ఆదేశములను నిర్లక్ష్యము చేయక నిస్సంకోచముగా పాటించుటయే అన్ని సందర్భాలలో శ్రేయోదాయకము.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..