Thursday, November 21, 2024

భగవత్‌ ఆరాధనలో…భావనే ప్రధానం!

నకి ఏ కష్టం వచ్చినా, ఏదైనా నష్టం జరిగినా మనకి ముందుగా గుర్తొచ్చే ది భగవంతుడే. గుర్తుకు తెచ్చుకునేది భగవంతుడినే. భారం అంతా పడ వేసేది భగవంతుడి పైనే. ఏ ఆపద వచ్చినా, ఏ రకమైన అపాయం ఎదురై నా, కోరికలు తీరకపోయినా, ఆశలు అడియాశలు అవుతున్నా, బాధలొచ్చినా, బాధ్యతలు తీరకపోయినా, బ్రతుకు భారమవుతున్నా, మనకి కనిపించేది దేవుడొక్కడే.
అప్పుడు ఆ దేవుడ్ని ప్రార్ధిస్తాం. ప్రాకులాడుతాం. పూజలు చేస్తాం. మొక్కు లు మొక్కుతాం. ముడుపులు కడతాం. కోరికల చిట్టా విప్పుతాం. కొబ్బరికాయ లు కొడతాం. నీ కొండకు వచ్చి దర్శనం చేసుకుంటాం అంటాం. ఉపవాసాలు చేస్తాం. కనిపించిన ప్రతి దేవునికి మన కోరికల అర్జీలు సమర్పిస్తాం. మన బాధలు తీరకపోతే దుస్తులు మార్చినంత సులువుగా దేవుళ్ళని మారుస్తాం. పాత దేవుళ్ళ ను వదిలేస్తాం. కొత్త దేవుళ్ళ చిట్టా వెతుక్కుని, ఆ కొత్త దేవుళ్ళ భక్తులమైపోతాం. ఇదీ యిప్పుడు సమాజంలో సహజంగా జరుగుతుండే ఆధ్యాత్మి క పరిణామ క్రమం తీరు.
మారుతున్న జరుగుతున్న పైన చెప్పుకున్న పరిణామాలకు ఎవర్నీ ఏ రకంగాను అనలేం. ఎవ రి యిష్టం వారిది. ఎవరి పరిస్థితి వారిది. ఎవరి విశ్వాసం వారిది. వారివారి దృక్పథాలను బట్టి ప్రతీదీ నడుస్తూ ఉంటుంది. మారుతూ ఉంటుం ది. స్థితిగతుల పైనా, పరిస్థితుల పైనా ఆధారపడి ఉంటుంది.
పూర్వం రోజుల్లో ఒకాయనికి చాలా చిక్కులొ చ్చాయి. ఏది అనుకున్నా జరిగేది కాదు. బాధలు పోవాలంటే అపారమైన దైవకృప ఎంతో అవసరం అని ఎవరో చెప్పారు. చెప్పింది నిజమేనని అనిపిం చింది. ఈశ్వరుడు భోళాశంకరుడు. ఉబ్బులింగ డు. భక్తుడు ఏదడిగినా కాదనని దేవుడు ఈశ్వరు డని ఈశ్వరుడ్ని పూజించాలనుకున్నాడు. వెంట నే బజారు నుంచి ఈశ్వరుడి విగ్రహాన్ని తెచ్చాడు. ఇంటిలో మంచి చోటు చూసుకుని టేబుల్‌ మీద ఈశ్వరుణ్ణి పెట్టి ధూప దీప నైవేద్యాలతో పూజించ టం మొదలుపెట్టాడు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడని అభిషేకం చేసేవాడు పళ్ళెంలో లింగం పెట్టుకుని. చాలా రోజులు ఈ రకంగా పూజా కార్యక్రమాలు చేసినా తన కోరికలు తీరలేదు. సమస్యలు తగ్గలేదు.
శ్రీకృష్ణుడు లీలలు మహమలు తెలిసిన దేవుడని, ఏదో ఒక అద్భుత మహమ చేసైనా భక్తులను ఆదుకుంటాడని, కష్టాల నుంచి కాపాడుతాడని ఎవరో చెప్పగా విన్నాడు. నిజమేననిపించింది. వెంటనే రోజూ పూజిస్తున్న ఈశ్వరుణ్ణి దూరంగా తలుపులు లేని కప్‌ బోర్డ్‌లో పెట్టేసి మంచి కృష్ణ విగ్రహాన్ని తెచ్చాడు. పరమ నిష్ట తో, దీక్షగా పూజించటం మొదలుపెట్టాడు. పూజ చివర్లో ఊదొత్తుల దొంతి వెలి గించి హారతి ఇస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి.కృష్ణుణ్ణి పూజిస్తున్నాడు కానీ కష్టాలు తీరలేదు.
ఇంతలో వినాయక చవితి పండుగ వచ్చింది. కోరిన కోర్కెలు తీరాలంటే , విఘ్నాలేవైనా ఉంటే విఘ్నాలన్నిటినీ తొలగించి కార్యాన్ని జయంచేసే దేవుడు వినాయకుడని తెలిసింది. వెంటనే మంచి వినాయక విగ్రహాన్ని తెచ్చి, కృష్ణ విగ్రహం ఉన్నచోట కృష్ణుని స్థానంలో పెట్టాడు. కృష్ణ విగ్రహాన్ని కప్‌బోర్డ్‌లో శివుని విగ్రహం పక్కన పెట్టేసాడు. వినాయకుడిని దీక్షగా ధూప దీప నైవేద్యాలతో పూజిస్తున్నాడు. కొన్నాళ్ళిలా సాగింది. ఫలితం ఏమీ కనిపించలేదు. కోరికలు తీర లేదు. ఆంజనేయస్వామి అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడని చుట్టుప క్కల వాళ్ళు చెప్పారు. ఈయనకి నిజమే అనిపించింది. వెంటనే బజారుకి వెళ్లి ఆం జనేయస్వామి విగ్రహాన్ని కొని తెచ్చి పూజించటం ఆరంభించాడు. కప్‌ బోర్డ్‌లో శివ, కృష్ణ విగ్రహాల పక్కన వినాయకుడ్ని పెట్టేసాడు.
ఆంజనేయస్వామి అయితే బ్రహ్మచారి. ఆంజనేయస్వామిని పరమనిష్టతో మడిగా శుచిగా ఆంజనేయస్వామిని గంఢ సింధూరంతో ఉదయం సాయంత్రం రెండుపూటలా పూజ చేస్తున్నాడు. ఫలితం మాత్రం కనబడలేదు. కష్టాలు తీర లేదు. ఏ దేవుడు తనకు మేలు చేస్తాడో తెలీని సందిగ్ధం.
తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ దేవుళ్ళందరూ మగవా రు. మగ దేవుళ్ళయితే సహజంగా అంత వేగంగా కరుణించరు. దేవతలైతే వేగిరం స్పందించే మాతృ హృదయం కలవారు అయిన కారణంగా భక్తులను వేగిరం కాస్తారు కాబట్టి అంబని కొలవాలి అనే నిర్ణయానికి వచ్చాడు. పార్వతీదేవి విగ్రహాన్ని పూజ చేసే స్థలంలో పెట్టి హనుమంతుణ్ణి కప్‌బోర్డ్‌లో ఉన్న తక్కిన విగ్ర హాల పక్కన పెట్టేసాడు.
కర్మ పరిపక్వతకు వొచ్చిందో, కాలం కలిసి వచ్చిందో, రెండూ కలిసి వచ్చాయో తెలీదు కానీ ఆయన కష్టాలు తీరాయి. సిరి సంపదలు ఎక్కువయ్యాయి. సు ఖం సంతో షం కలిగాయి. అతనికి అంబ మీద నమ్మకం కుదిరింది. మంచి విశ్వాసంతో అంబను పూజిస్తున్నాడు. ఓ రోజు పూజా సమయ ం లో ధూపం ఇవ్వాలని సాంబ్రాణిని వెలిగిం చాడు. అప్పుడు గాలి కప్‌బోర్డ్‌ వైపుకి వీస్తు న్న కారణంగా సాంబ్రాణి పొగ కప్‌ బోర్డ్‌ వైపుకి వెళుతోంది.
అతనికి చిరాకు కోపం వచ్చాయి. కప్‌ బోర్డ్‌లో ఉన్న దేవుళ్ళ వైపు సాంబ్రాణి ధూ పం వెళ్లటం ఇతనికి ఏమాత్రమూ నచ్చలే దు. కోపం పట్టలేకపోయాడు. కప్‌ బోర్డ్‌లో ఉన్న దేవుళ్ళకు సాంబ్రాణిని ఆఘ్రాణించే అర్హత లేదనుకున్నాడు. ఎలాగైనా ఆ దేవు ళ్ళకు సాంబ్రాణి ధూపం వెళ్లకుండా చేయా లనే నిర్ణయానికి వచ్చాడు. కప్‌బోర్డ్‌లో ఉన్న అన్ని దేవుళ్ళ విగ్రహాలకు, వాటి ము క్కుల్నీ, నోటినీ ఒక్కో గుడ్డతో బంధించేసా డు. గుడ్డతో విగ్రహాలని కట్టిపడేసి అంబ పూజకి ప్రశాం తంగా కూర్చుని అంబని పూజిస్తూ కన్నులు మూసుకున్నాడు. కొంతసేపైన తర్వా త కళ్ళువిప్పి చూసాడు. పరమ శివుడు, కృష్ణుడు, గణశుడు, ఆంజనేయుడు ఎదురుగా నిల్చుని ఉన్నారు. ప్రసన్నంగా ప్రశాంతంగా నవ్వుతున్నారు.
అది చూసిన ఆ ఆసామీకి ఆశ్చర్యమనిపించింది. ”నేను మిమ్మల్ని అందరినీ చాలాకాలం భక్తిశ్రద్ధలతో ఆరాధించాను. మీరప్పుడు రాలేదు. మిమ్మల్ని నేనిప్పు డు రమ్మనమని పిలవలేదు. పైగా మీమీద కోపంతో మీ ముక్కుల్ని, మూతుల్ని గుడ్డలతో బంధించేసాను. మీరెందుకు యిప్పుడు వచ్చారు?” అని అడిగాడు.
అప్పుడు పరమశివుడు ”నాయనా! అప్పుడు నిర్జీవమైన విగ్రహాలుగా మమ్మల్ని భావించావు. పూజలు చేసావు. కానీ యిప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కాబట్టే మమ్మల్ని ఈ గుడ్డలతో బంధించావు. సజీవ మూర్తులుగా భావించావు కాబట్టే మేము నీకు దర్శనమిచ్చాం.” అని రహస్యం విప్పి చెప్పారు . తక్కిన దేవుళ్ళు అవునన్నట్టు చిరునవ్వు నవ్వారు. అందరూ అతడ్ని ఆశీర్వదించి అంతర్ధానమై పోయారు. భగవంతుడ్ని బాహ్యంతో కాదు భావంతో ఆరాధిం చాలి. ఆర్భాటంతో కా దు. ఆర్తితో ఆర్ద్రతతో ఆరాధించాలి. పూజించే ప్రతిమలను దివ్యత్వాలుగా భావించగలగాలి. విగ్రహం మూర్తులను చిత్రపటాలను సజీవ దివ్యత్వ స్వరూ పాలుగా భావన చేయగలగాలి. దివ్యత్వాలను దైవత్వాలను హృదయంలో నిలు పుకుని పూజి ంచాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement