అధ్యాయం 2, శ్లోకం 57
57
య: సర్వత్రానభిస్నేహ:
తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
తాత్పర్యము : భౌతిక జగమునందు ప్రాప్తించిన మంచి, చెడులను ప్రశంసించుట గాని, ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడై నిలుచును.
భాష్యము : ఈ భౌతిక ప్రపంచములో ఉన్నంతకాలము ప్రతి వ్యక్తి మంచి, చెడులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఎందువలనంటే ఈ ప్రపంచము ద్వంద్వములతో కూడుకుని ఉన్నది. అయితే కృష్ణుడే తనకు ముఖ్యమని భావించే భక్తుడు, కృష్ణుడు ఏది పంపించినా మంచిదేనని మంచి చెడుల మధ్య స్థిరముగా ఉండగలుగుతాడు. కృష్ణుని పట్ల అటువంటి చైతన్యము కలిగిన భక్తుడు దివ్యస్థితిలో ఉండి, సమాధి మగ్నుడైనట్లు అర్థము చేసుకొనవలెను.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..