అధ్యాయం 2, శ్లోకం 55
55
శ్రీ భగవాన్ ఉవాచ
ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్ట:
స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే ||
తాత్పర్యము : శ్రీ కృష్ణ భగవానుడు పలికెను : ఓ పార్థా ! మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
భాష్యము : శ్రీమద్భాగవతము నందు తెలియజేయబడినట్లు భగవద్భక్తునికి సాధువుల మంచి లక్షణాలన్నీ ఉంటాయి. అలా కానటువంటి వ్యక్తికి ఎటువంటి మంచి లక్షణాలు ఉండవు. ఎందువలననగా అతడు మనస్సు చెప్పేవాటినన్నింటినీ చేస్తూ ఉంటాడు. అందువలననే ఈ శ్లోకమునందు మనో సంకల్పము చేత పుట్టిన భౌతిక కోరికలన్నీ వదిలిపెట్టవలెనని చెప్పబడినది. అయితే అలాంటి భౌతిక కోరికలకు అవకాశముండదు. కాబట్టి అందరూ నిస్సంకోచముగా కృష్ణచైతన్యంతో కార్యములను చేపట్టి దివ్య స్థితికి ఎదుగవచ్చును. అటువంటి వ్యక్తి తన సహజ స్థితిలో భగవంతుని నిత్యదాసుడుగా స్థితుడగుటచే ఎల్లప్పుడూ ఆనందముగా ఉంటాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..